మీట్ యువర్ సీపీ: అపాయింట్‌మెంట్ లేకుండానే కమిషనర్‌ను కలవొచ్చు!

naveen
By -

Hyderabad Police Commissioner VC Sajjanar interacting with citizens at Command Control Center

అపాయింట్‌మెంట్ అక్కర్లేదు.. నేరుగా కమిషనర్‌తోనే మాట్లాడొచ్చు! హైదరాబాద్ పోలీసుల కొత్త ప్లాన్ అదిరింది


మీకు ఏదైనా సమస్య ఉందా? పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి విసిగిపోయారా? అయితే మీకో గుడ్ న్యూస్. ఇకపై మీరు ఎవరి పర్మిషన్ కోసం ఎదురుచూడక్కర్లేదు. ముందస్తు అపాయింట్‌మెంట్ అసలే అవసరం లేదు. నేరుగా హైదరాబాద్ పోలీస్ బాస్, కమిషనర్ వీసీ సజ్జనార్ (VC Sajjanar) నే కలిసి మీ గోడు వెళ్లబోసుకోవచ్చు. ప్రజలకు పోలీసులను మరింత చేరువ చేసేందుకు సిటీ పోలీసులు 'మీట్ యువర్ సీపీ' (Meet Your CP) అనే వినూత్న కార్యక్రమానికి తెరలేపారు. అసలు ఈ ప్రోగ్రామ్ టైమింగ్స్ ఏంటి? పాతబస్తీ వాసులకు ఇచ్చిన స్పెషల్ ఆఫర్ ఏంటి?


మధ్యాహ్నం 2 గంటలకు.. కమాండ్ కంట్రోల్ సెంటర్లో..

పోలీసులంటే భయం పోవాలి, ఫ్రెండ్లీ పోలీసింగ్ రావాలి అనే ఉద్దేశంతో కమిషనర్ సజ్జనార్ ఈ కొత్త కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. ఈ వారం నుంచే ఇది అమల్లోకి వచ్చింది. ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి బంజారాహిల్స్ లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (TGICCC)లో కమిషనర్ అందుబాటులో ఉంటారు. సామాన్య ప్రజలు నేరుగా వెళ్లి ఆయన్ను కలవొచ్చు. ట్రాఫిక్ సమస్యలైనా, శాంతిభద్రతల ఇబ్బందులైనా, లేదా స్థానిక భద్రతపై సలహాలైనా నేరుగా సీపీకే చెప్పొచ్చు.


పాతబస్తీ వాసులకు ఫ్రైడే స్పెషల్

పాతబస్తీ (Old City) నుంచి బంజారాహిల్స్ రావాలంటే ట్రాఫిక్ కష్టాలు, ప్రయాణ భారం ఉంటాయని కమిషనర్ ఆలోచించారు. అందుకే వారి సౌకర్యార్థం ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి శుక్రవారం కమిషనర్ స్వయంగా పాతబస్తీలోని పురానీ హవేలీ (Purani Haveli)లో ఉన్న 'కోత్వాల్ హౌస్'కు వెళ్తారు. అక్కడ ప్రత్యేకంగా దర్బార్ నిర్వహించి స్థానికుల సమస్యలు వింటారు. దీనివల్ల పాతబస్తీ వాసులు సుదూరం ప్రయాణించాల్సిన పని తప్పుతుంది.


సమస్య వినడమే కాదు.. పరిష్కారం కూడా!

కేవలం ఫిర్యాదులు తీసుకోవడమే కాదు, వాటిని నిర్ణీత గడువులోగా పరిష్కరించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ప్రజల నుంచి వచ్చే అర్జీలను వెంటనే సంబంధిత విభాగాలకు పంపించి, యాక్షన్ తీసుకునేలా చూస్తామని పోలీస్ ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. పారదర్శకమైన పాలన అందించడంలో భాగంగానే ఈ చొరవ తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే దీనిపై కమిషనర్ సజ్జనార్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఒక వీడియోను కూడా విడుదల చేశారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


దళారులు లేరు.. పైరవీలు లేవు! 

మీ సమస్య నేరుగా కమిషనర్ టేబుల్ మీదకే వెళ్తుంది. హైదరాబాద్ పోలీసుల ఈ ఫ్రెండ్లీ నిర్ణయం నిజంగా అభినందనీయం.


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!