Operation 2.0: పాకిస్థాన్‌కు ఆర్మీ సీరియస్ వార్నింగ్

naveen
By -

మనం ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్నాం, మన పనులు మనం చేసుకుంటున్నాం అంటే.. సరిహద్దుల్లో సైన్యం పహారా కాయడమే కాదు, శత్రువు గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. గతేడాది పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై భారత సైన్యం చేసిన 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor) గుర్తుంది కదా? కేవలం 22 నిమిషాల్లో దాయాది దేశం వెన్నులో వణుకు పుట్టించిన మన సైన్యం.. ఇప్పుడు 'ఆపరేషన్ 2.0' గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈసారి దాడి చేస్తే ఎలా ఉంటుందో వెస్టర్న్ కమాండ్ చీఫ్ ఇచ్చిన వార్నింగ్ ప్రతి భారతీయుడి రక్తాన్ని ఉడికించేలా ఉంది. అసలు ఆర్మీ ఎందుకింత సీరియస్ వార్నింగ్ ఇచ్చింది? 


Operation 2.0


22 నిమిషాల్లో దాయాదికి చుక్కలు!


గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాదులు చేసిన దాడికి ప్రతీకారంగా మే 7న భారత్ 'ఆపరేషన్ సిందూర్' చేపట్టింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) లోని ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది. అసలు ఏం జరుగుతుందో పాకిస్థాన్ తెలుసుకునే లోపే, కేవలం 22 నిమిషాల్లో మన సైన్యం ఆపరేషన్ ముగించి దర్జాగా వెనక్కి వచ్చేసింది.


ఆ దెబ్బకు పాకిస్థాన్ వైమానిక, క్షిపణి స్థావరాలు నామరూపాల్లేకుండా పోయాయి. వాటికి పాక్ ఇప్పటికీ రిపేర్లు చేసుకుంటోందంటే మన దాడి ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత మన పవర్ ముందు తలవంచిన పాక్.. ఇతర దేశాల కాళ్లు పట్టుకుని మే 10న కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంది.


"ఈసారి దాడి మరింత కఠినంగా ఉంటుంది"


వెస్టర్న్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కతియార్ తాజాగా పాకిస్థాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఒకవేళ మళ్లీ ఆపరేషన్ సిందూర్ తరహాలో 'ఆపరేషన్ 2.0' చేయాల్సి వస్తే.. అది గతంలో కంటే ఎన్నో రెట్లు కఠినంగా ఉంటుందని తేల్చిచెప్పారు.


మనల్ని నేరుగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం పాకిస్థాన్‌కు లేవని ఆయన ఎద్దేవా చేశారు. అందుకే వాళ్లు దొడ్డిదారిన ఉగ్రవాదులను ఉసిగొల్పుతూ (ప్రాక్సీ వార్) పిరికిపందల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 1971 బంగ్లాదేశ్ విముక్తి పోరాటం, కార్గిల్ లాంటి దెబ్బలు తిన్నా పాక్‌కు బుద్ధి రాలేదని, కనీసం ఈ ఆపరేషన్ సిందూర్ దెబ్బతోనైనా బుద్ధి తెచ్చుకుంటే మంచిదని ఆయన చురకలంటించారు.


శత్రువు భయమే.. మన భద్రత!


సరిహద్దుల్లో ఉగ్రవాదులను పంపి కవ్వింపు చర్యలకు పాల్పడితే కేవలం దౌత్యపరమైన చర్చలు చేసే పాత కాలం పోయింది. 'కొడితే ఎలా ఉంటుందో' ఆపరేషన్ సిందూర్‌తో ప్రాక్టికల్ గా చూపించారు. ఇప్పుడు ఆర్మీ చేసిన ఈ 'ఆపరేషన్ 2.0' వార్నింగ్.. కేవలం పాకిస్థాన్‌కే కాదు, భారత్ వైపు కన్నెత్తి చూసే ఏ దేశానికైనా ఒక స్పష్టమైన మెసేజ్. జాతీయ భద్రత విషయంలో రక్షణ బలగాల అగ్రెసివ్ స్టాండ్ వల్లే.. దేశంలోకి ఉగ్రవాదులు చొరబడకుండా సామాన్యుడు సురక్షితంగా ఉన్నాడు. రాబోయే రోజుల్లో పాక్ ఏమాత్రం తోక జాడించినా.. మ్యాప్‌లో ఆ దేశం వైమానిక స్థావరాలు వెతుక్కోవాల్సిందే!


Tags: