Varanasi Movie Update: ప్రకాష్ రాజ్ రోల్ రివీల్!

naveen
By -
Varanasi Movie Update


భారతీయ వెండితెరపై రాబోతున్న అతిపెద్ద విజువల్ వండర్ 'వారణాసి' (Varanasi). సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్ అంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. గ్లోబల్ ఆడియన్స్ అంతా ఈ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. 


ఇప్పటివరకు 'రుద్ర'గా మహేష్, 'మందాకిని'గా ప్రియాంక చోప్రా, 'కుంభ'గా పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలను మాత్రమే రాజమౌళి రివీల్ చేశారు. కానీ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) పాత్రేంటన్నది మాత్రం సస్పెన్స్ గా ఉంచారు. అయితే, తాజాగా ప్రకాష్ రాజే స్వయంగా ఆ సీక్రెట్ ను బ్రేక్ చేశారు. జక్కన్న చెక్కిన ఆ పాత్ర ఏంటి? మహేష్ తో ఆయన బాండింగ్ ఎలా ఉండబోతోంది?


వచ్చే ఏడాది (2027) సమ్మర్ లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రామాయణం ఎపిసోడ్ షూటింగ్ పూర్తయిందని, అందులో మహేష్ కొద్దిసేపు రాముడిగా కనిపిస్తారని రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. 


ఈ భారీ బడ్జెట్ చిత్రంలో ప్రకాష్ రాజ్ కూడా నటిస్తున్నారని తెలిసినప్పటి నుంచి.. ఆయన మహేష్ బాబుకు తండ్రిగా నటిస్తున్నారనే ప్రచారం జరిగింది. కానీ ఆ రూమర్లకు చెక్ పెడుతూ ప్రకాష్ రాజ్ అసలు విషయాన్ని బయటపెట్టారు. తాజాగా ఓ న్యూస్ ఛానల్ డిబేట్ లో పాల్గొన్న ఆయన.. "వారణాసిలో నేనొక పరమ శివ భక్తుడిని (Shiva Bhakta)" అని రివీల్ చేశారు.


గతంలో 'ఢమరుకం' సినిమాలో సాక్షాత్తు శివుడిగా కనిపించి మెప్పించిన ప్రకాష్ రాజ్.. ఈ సినిమాలో శివ భక్తుడిగా కనిపించనుండటం విశేషం. ఈ పాత్ర తనలోని నటుడి ఆకలిని తీర్చిందని, రాజమౌళి, మహేష్, ప్రియాంకలతో పనిచేయడం ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చింది" అని ఆయన పేర్కొన్నారు.


'విక్రమార్కుడు' తర్వాత రాజమౌళితో, 'గుంటూరు కారం' తర్వాత మహేష్ తో కలుస్తున్న ప్రకాష్ రాజ్.. ఈ సినిమాలో చాలా పవర్ ఫుల్ గా కనిపించబోతున్నారని అర్థమవుతోంది. 'రాజకుమారుడు' నుంచి మహేష్-ప్రకాష్ రాజ్ కాంబినేషన్ అంటేనే హిట్ సెంటిమెంట్. ఇప్పుడు 'వారణాసి'లోనూ ఆ మ్యాజిక్ రిపీట్ కాబోతోంది. మరోవైపు తాను హిందీలో 'దృశ్యం 3'లోనూ కీలక పాత్ర చేస్తున్నట్లు ఆయన తెలిపారు.


 రుద్రుడికి తోడుగా శివ భక్తుడు!  

రాజమౌళి చెక్కిన ఈ పాత్ర.. ప్రకాష్ రాజ్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ గా నిలవడం ఖాయం. తండ్రి పాత్ర కాదని తేలిపోయింది.. ఇక భక్తుడి విశ్వరూపం చూడటమే బ్యాలెన్స్.


Tags:

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!