"నాకు దూకుడు ఎక్కువని వదిలేశాడు.. వాడు పోవడం నా మంచికే!" మృణాల్ ఠాకూర్ ఓపెన్ కామెంట్స్.. ఆ రెండు రూమర్లపై క్లారిటీ

naveen
By -

"సీతారామం" బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) అంటేనే క్లాస్ అండ్ మెచ్యూరిటీకి కేరాఫ్ అడ్రస్. కానీ ఆమె పర్సనల్ లైఫ్ లో జరిగిన ఒక చేదు సంఘటనను ఇప్పుడు బయటపెట్టింది. "నువ్వు మరీ టూమచ్.. నీతో వేగలేను" అంటూ బ్రేకప్ చెప్పిన మాజీ ప్రియుడికి ఆమె ఇచ్చిన రిప్లై ఏంటో తెలుసా? "నువ్వు పోతే పో.. నాకెలాంటి బాధ లేదు" అని లైట్ తీసుకుందట. అసలు ఆ లవ్ స్టోరీ ఎందుకు బ్రేక్ అయ్యింది? నటన వల్లే గొడవలా? ధనుష్, శ్రేయస్ అయ్యర్ లతో డేటింగ్ రూమర్ల మాటేమిటి?


Mrunal Thakur


నటన నచ్చలేదట.. దూకుడు ఎక్కువట!

తాజాగా తన కొత్త సినిమా ‘దో దీవానే శహర్‌ మే’ (ఫిబ్రవరి 20న రిలీజ్) ప్రమోషన్స్ లో మృణాల్ తన గతం గురించి నోరు విప్పింది. తన మాజీ ప్రియుడు బ్రేకప్ చెప్పడానికి చెప్పిన కారణాలు వింటే ఆశ్చర్యం వేస్తుంది. "నాకు దూకుడు (Aggression) ఎక్కువని, నాతో ఉండలేనని వదిలేశాడు. అంతేకాదు, నేను సినిమాల్లో నటించడం కూడా అతనికి అస్సలు ఇష్టం లేదు. అదే మా మధ్య దూరాన్ని పెంచింది" అని మృణాల్ వివరించింది.


బాధ లేదు.. జాలి మాత్రమే ఉంది!

సాధారణంగా బ్రేకప్ అయితే ఎవరైనా బాధపడతారు. కానీ మృణాల్ మాత్రం "హమ్మయ్య" అనుకుందట. "అతను బ్రేకప్ చెప్పినందుకు నాకేం బాధ లేదు. నిజానికి అతడి సంకుచిత మనస్తత్వం చూసి జాలిపడ్డాను. అలాంటి వాళ్లతో జీవితం పంచుకుంటే.. రేపు పుట్టబోయే పిల్లలు కూడా అదే భావాలతో పెరుగుతారు. అది నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే విడిపోవడమే మంచిదైంది" అని స్ట్రాంగ్ గా ఆన్సర్ ఇచ్చింది.


ధనుష్, శ్రేయస్ లతో లవ్ ట్రాక్?

గత కొంతకాలంగా మృణాల్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. మొదట కోలీవుడ్ స్టార్ ధనుష్ (Dhanush) తో డేటింగ్ అని ప్రచారం జరిగింది. అది కేవలం స్నేహం మాత్రమేనని ఆమె ఖండించింది. ఆ తర్వాత టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తో ప్రేమాయణం అంటూ వార్తలు వచ్చాయి. దీనిపై మృణాల్ స్పందిస్తూ.. "ఇవన్నీ వినడానికే చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇవన్నీ ఫ్రీ పీఆర్ స్టంట్స్ (Free PR Stunts). ఇలాంటి రూమర్స్ చూసి నేను నవ్వుకుంటాను తప్ప సీరియస్ గా తీసుకోను" అని క్లారిటీ ఇచ్చేసింది.


సెల్ఫ్ రెస్పెక్ట్ ముఖ్యం బిగులు! 

నచ్చే వృత్తిని, నచ్చే వ్యక్తిత్వాన్ని కాదని.. ప్రేమ కోసం మారాల్సిన అవసరం లేదని మృణాల్ స్టోరీ నిరూపిస్తోంది. టాక్సిక్ రిలేషన్ షిప్ కంటే హ్యాపీ సింగిల్ లైఫ్ బెటర్ అని ఆమె చెప్పకనే చెప్పింది.


Tags: