Naa Anveshana Insta: అన్వేష్ అకౌంట్ మళ్లీ వచ్చేసింది!

naveen
By -

నిన్నటిదాకా సోషల్ మీడియాలో ఒకటే గోల.. "అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లేచిపోయింది.. నేను కంప్లైంట్ ఇస్తేనే పోలీసులు లేపేశారు" అని నటి కరాటే కళ్యాణి ఒకవైపు సంబరాలు. కానీ 24 గంటలు తిరక్కుండానే సీన్ రివర్స్ అయింది. యూట్యూబర్ 'నా అన్వేషణ' (Naa Anveshana) అన్వేష్ ఇన్‌స్టా అకౌంట్ మళ్లీ ప్రత్యక్షమైంది! అసలు ఈ అకౌంట్ ఎందుకు పోయింది? మళ్లీ ఎలా వచ్చింది? 'ఈ యాప్స్ అమెరికావి అవ్వడం వల్లే తాను బతికిపోయాను' అని అన్వేష్ ఎందుకు అన్నాడు? ఒకరి అకౌంట్ కి టెక్నికల్ ఇష్యూ వస్తే, ఇంకొకరు క్రెడిట్ తీసుకోవడం వెనుక ఉన్న సోషల్ మీడియా డ్రామాను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే.


Naa Anveshana Insta


కరాటే కళ్యాణి క్రెడిట్.. అన్వేష్ కౌంటర్! 

అన్వేష్ అకౌంట్ కనిపించకుండా పోగానే.. తాను ఇచ్చిన ఫిర్యాదు వల్లే యాక్షన్ తీసుకున్నారని కరాటే కళ్యాణి (Karate Kalyani) గొప్పలు చెప్పుకున్నారు. నెక్స్ట్ టార్గెట్ యూట్యూబ్ ఛానలే అని కూడా ప్రకటించారు.


కానీ గంటల వ్యవధిలోనే అకౌంట్ తిరిగి రావడంతో నెటిజన్లు కళ్యాణిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అకౌంట్ బ్యాన్‌కి, కళ్యాణి కంప్లైంట్‌కి ఎలాంటి సంబంధం లేదని, అదొక టెక్నికల్ గ్లిచ్ అని తేలిపోవడంతో సీన్ రివర్స్ అయింది.


అసలు అకౌంట్ ఎందుకు పోయిందంటే? 

తాజాగా అన్వేష్ ఓ వీడియో ద్వారా అసలు నిజం బయటపెట్టాడు. మదనపల్లెలో ఏడేళ్ల బాలికపై జరిగిన దారుణం గురించి వీడియో పెట్టినప్పుడు, కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ప్రకారం ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ప్రూఫ్ అడిగిందట.


పాత పాస్‌పోర్ట్ బదులు కొత్త పాస్‌పోర్ట్ డీటెయిల్స్ మూడుసార్లు తప్పుగా అప్‌లోడ్ చేయడంతో.. ఇన్‌స్టాగ్రామ్ సెక్యూరిటీ సిస్టం అతని అకౌంట్‌ను 48 గంటల పాటు డియాక్టివేట్ (Deactivate) చేసింది. దీన్ని జనాలు ఎలా తీసుకుంటారో అని తానొక ఆటగా భావించానని అన్వేష్ చెప్పాడు.


"నేను పుట్టింది, చచ్చేది హిందువుగానే" 

"ఇన్‌స్టా, ఫేస్‌బుక్ అమెరికా సంస్థలు కాబట్టే నేను నిజాయితీగా బతకగలుగుతున్నాను. ఇండియావి అయితే మీ దరిద్రపు రాజకీయాలకు బలైపోయేవాడ్ని" అంటూ అన్వేష్ ఘాటుగా పోస్ట్ పెట్టాడు.


తాను సీతాదేవిని తిట్టినట్లు నిరూపిస్తే పది లక్షలు ఇస్తానని సవాల్ చేశాడు. తాను హిందువుగా పుట్టానని, హిందువుగానే చస్తానని.. కానీ ప్రపంచ దేశాలు తిరగడం వల్ల అన్ని మతాలను సమానంగా గౌరవిస్తానని క్లారిటీ ఇచ్చాడు.


సోషల్ మీడియాలో 'ఫేక్ క్రెడిట్'ల గోల! 

ఎవరి అకౌంట్ అయినా హ్యాక్ అయినా, టెక్నికల్ ఇష్యూతో పోయినా వెంటనే "నా వల్లే పోయింది" అని క్రెడిట్ తీసుకోవడం ఈరోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది. సాంకేతిక కారణాలతో జరిగే పరిణామాలను తమ విజయంగా ప్రచారం చేసుకుంటే, నిజం బయటపడ్డాక పరువు పోవడం ఖాయం. నెటిజన్లు కూడా ఇలాంటి ఫేక్ క్లెయిమ్స్ చూసి గుడ్డిగా నమ్మకూడదు.


ఇది కూడా చదవండి (Also Read):

Naa Anveshana Instagram Ban: అన్వేష్ వార్నింగ్
Tags: