నేపాల్‌లో అర్ధరాత్రి హైడ్రామా.. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ అరెస్ట్.. ఊహించని ట్విస్ట్!
నేపాల్ రాజకీయ చరిత్రలో ఒక కనీవినీ ఎరుగని సంచలనం! నిన్నటి వరకు ఆ దేశాన్ని ఏలిన ఓ తిరుగులేని నాయకుడు.. ఈరోజు కటకటాల పాలయ్యాడు. నేపాల్ రాజకీయాలను శాసించిన మాజీ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ శనివారం తెల్లవారుజామున నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ కావడం యావత్ దేశాన్ని షాక్‌కు గురిచేసింది. అది కూడా సరికొత్త ప్రధానిగా 'బాలెన్ షా' ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఈ హై-ప్రొఫైల్ అరెస్ట్ జరగడం ఇప్పుడు గ్లోబల్ మీడియాలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు ఆ అర్ధరాత్రి ఏం జరిగింది?
జెన్ జెడ్ (Gen Z) రక్తపాతం..
ఈ అరెస్ట్ వెనుక ఒక నెత్తుటి చరిత్ర ఉంది. కేపీ శర్మ ఓలీ ప్రధానిగా ఉన్న సమయంలో నేపాల్‌లో రగిలిన 'జెన్ జెడ్' (Gen Z) నిరసనలను అత్యంత దారుణంగా, హింసాత్మకంగా అణచివేశారన్న ప్రధాన ఆరోపణల నేపథ్యంలోనే నరహత్య కేసు కింద ఆయనను అధికారులు అరెస్ట్ చేసినట్లు తేల్చిచెప్పారు.
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్ట్-లెనినిస్ట్) లాంటి అతిపెద్ద పార్టీకి నాయకుడిగా ఉంటూ, ఏకంగా నాలుగుసార్లు ప్రధానమంత్రిగా దేశాన్ని ఏలిన ఓలీకి ఇప్పుడు పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉండటం గమనార్హం. ఆయనపై ముమ్మరంగా విచారణ జరపాలని నేపాల్‌లోని ఒక పవర్‌ఫుల్ ఉన్నతస్థాయి కమిషన్ సిఫార్సు చేయడంతో ఈ భారీ ఆపరేషన్‌కు తెరలేచింది.
మాజీ హోం మంత్రి కూడా కటకటాలకే!
ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో ఓలీ ఒక్కరే కాదు, మరో కీలక నేత కూడా జైలు పాలయ్యాడు. ఇదే నరహత్య కేసులో నేపాలీ కాంగ్రెస్ అగ్ర నాయకుడు, నాటి మాజీ హోం మంత్రి 'రమేష్ లేఖక్'ను కూడా అధికారులు అరెస్ట్ చేశారు. భక్తపూర్‌లోని వారివారి నివాసాల మీద తెల్లవారుజామున ఆకస్మిక దాడులు చేసిన అధికారులు.. ఈ ఇద్దరు బడా నాయకులను ఏకకాలంలో అదుపులోకి తీసుకున్నారు. వీరికి పదేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్ల కింద అభియోగాలు మోపేందుకు రంగం సిద్ధమైంది.
ఏంటి ఆ జెన్ జెడ్ విప్లవం.. 77 మంది బలి!
అసలు ఓలీ కొంపముంచిన ఆ జెన్ జెడ్ విప్లవం ఏంటో తెలుసుకుంటే గుండె రగిలిపోక మానదు. 2025 సెప్టెంబర్‌లో నేపాల్ యువత ఒక సునామీలా రోడ్లెక్కింది. ఓలీ హయాంలో పెరిగిపోయిన దారుణమైన పాలనా వైఫల్యాలు, అవినీతి, తారాస్థాయికి చేరిన నిరుద్యోగం, రాజకీయ అస్థిరతపై యువతలో కట్టలు తెంచుకున్న ఆగ్రహమే ఈ 'జెన్ జెడ్ విప్లవం'.
మొదట్లో కేవలం డిజిటల్ స్వేచ్ఛ కోసం సాదాసీదాగా ప్రారంభమైన ఈ ఉద్యమం.. ఆ తర్వాత ఏకంగా ప్రభుత్వాన్ని గద్దెదించే స్థాయికి చేరింది. భయపడిపోయిన నాటి ఓలీ ప్రభుత్వం యువతపై తీవ్ర అణచివేతకు పాల్పడింది. ఆ రక్తపాతంలో కనీసం 77 మంది అమాయక యువకులు ప్రాణాలు కోల్పోగా.. 2,000 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఆ యువత ఉసురే ఇప్పుడు ఓలీకి చుట్టుకుంది.
కొత్త బాస్ ఎంట్రీ.. రాపర్ టు ప్రైమ్ మినిస్టర్!
ఒకవైపు పాత తరం నాయకులు జైలుకెళ్తుంటే.. మరోవైపు నేపాల్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తూ ఒక కుర్ర నాయకుడు సుడిగాలిలా దూసుకొచ్చాడు. ఒకప్పుడు ర్యాప్ సాంగ్స్ పాడుకునే ఒక సాధారణ కుర్రాడు.. నవతరం నాయకుడిగా ఎదిగి శుక్రవారం నేపాల్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశాడు.
అతడే 35 ఏళ్ల బాలేంద్ర షా అలియాస్ 'బాలెన్'. శీతల్ నివాస్‌లోని అధ్యక్ష కార్యాలయంలో జరిగిన ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో దేశ అధ్యక్షుడు రామ్ చంద్రపౌడెల్ ఆయనతో ప్రమాణం చేయించారు. గతంలో ఖాట్మాండు నగరానికి మేయర్‌గా తన సత్తా చాటిన బాలెన్.. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా అతి పిన్న వయసులో దేశ ప్రధానిగా ఎన్నికై చరిత్ర పుటల్లో ఎక్కాడు.
కొత్త ప్రధాని తొలి సంతకమే.. పాత ప్రధాని అరెస్ట్!
అధికారం చేపట్టిన వెంటనే బాలెన్ తన మార్క్ ఏంటో చూపించాడు. కొత్తగా ఏర్పాటైన బాలేంద్ర షా మంత్రివర్గం తొలిరోజే అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. గత సెప్టెంబరులో అమాయక యువతపై జరిగిన జెన్ జెడ్ నెత్తుటి మారణకాండపై దర్యాప్తు జరిపిన ఉన్నతస్థాయి కమిషన్ సిఫార్సులను ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణం అమలు చేయాలని ఆదేశించింది. ఆ మొదటి దెబ్బకే నేపాల్ మాజీ ప్రధాని, మాజీ హోం మంత్రులు ఊచలు లెక్కపెడుతున్నారు.
మొత్తానికి నేపాల్ గడ్డపై ఒక కొత్త యుగం మొదలైంది.. తప్పు చేసిన వాడు ఎంతటివాడైనా శిక్ష తప్పదన్న పవర్ ఫుల్ మెసేజ్ ప్రపంచానికి వెళ్లింది!
Also Read:
1971 పాకిస్థాన్ దురాగతాలు: బంగ్లాదేశ్‌కు భారత్ మద్దతు!అమెరికా డ్రీమ్.. ఇక పీడకలేనా? H-1B వీసా నిబంధనల్లో భారీ మార్పులు
ఇరాన్‌పై ట్రంప్ మాస్టర్ ప్లాన్.. యుద్ధానికి సంకేతంగా పెంటగాన్ పిజ్జాలు!
ట్రంప్ సంచలన నిర్ణయం: ఇరాన్‌పై దాడులు 10 రోజులు వాయిదా!
డాలర్‌పై ట్రంప్ సంతకం: 165 ఏళ్ల అమెరికా చరిత్ర బ్రేక్!

