వెండితెర మ్యాజిక్.. తెరవెనుక కాంట్రవర్సీ: 'ధురంధర్ 2' సిగరెట్ వివాదంపై మాధవన్ సంచలన క్లారిటీ!
వెండితెరపై బాక్సాఫీస్ రికార్డులు బద్దలవుతుంటే.. తెరవెనుక మాత్రం ఒక సెన్సిటివ్ వివాదం అగ్గి రాజేస్తోంది. బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్, సౌత్ స్టార్ మాధవన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం 'ధురంధర్ 2' (Dhurandhar 2) అనూహ్యంగా చిక్కుల్లో పడింది. ఈ సినిమాలో హీరోల యాక్షన్ ఫ్యాన్స్‌కు ఓ రేంజ్ కిక్ ఇస్తుంటే.. ఒకే ఒక్క సన్నివేశం మాత్రం ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది.
తెరపై పవర్‌ఫుల్ సీన్.. పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన వివాదం
టాలెంటెడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ అత్యంత అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమాలో.. మాధవన్ 'అజయ్ సన్యాల్' అనే పవర్‌ఫుల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) డైరెక్టర్ పాత్రలో నటించి మెప్పించారు. అయితే ఇందులో సిక్కుల పవిత్ర గ్రంథమైన ‘దశమ్ గ్రంధం’ లోని శ్లోకాలను మాధవన్ పఠించే ఒక ఎమోషనల్ సీన్ ఉంది. సరిగ్గా ఈ పవిత్రమైన లైన్లు చెబుతున్న సమయంలోనే ఆయన సిగరెట్ తాగుతూ కనిపించాడన్న ఆరోపణలు ఒక్కసారిగా ఇండస్ట్రీని షేక్ చేశాయి.
సిక్కుల ఆరాధ్య దైవం గురు గోవింద్ సింగ్ రాసిన పవిత్ర శ్లోకాలను పఠిస్తూ ధూమపానం చేయడం ఏంటని విమర్శలు వెల్లువెత్తాయి. ఇది సిక్కు సమాజపు మనోభావాలను, గురువాని గౌరవాన్ని ఘోరంగా దెబ్బతీయడమేనంటూ ముంబైకి చెందిన సిక్కు నాయకుడు, శివసేన లీడర్ గుర్జీత్ సింగ్ ఖేర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఏకంగా ములుండ్ పోలీస్ స్టేషన్‌లో చిత్ర బృందంపై ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం మరింత ముదిరిపోయింది.
నేను పొగ తాగలేదు.. వీడియోతో మాధవన్ ఎమోషనల్ క్లారిటీ
తనపై వస్తున్న ఆరోపణలు, రేగుతున్న వివాదంపై మాధవన్ వెంటనే స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘమైన వీడియో ద్వారా అభిమానులకు, సిక్కు సమాజానికి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ముందుగా 'ధురంధర్' టీమ్ తరపున ప్రేక్షకులు చూపుతున్న ప్రేమకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. పవిత్రమైన దశమ్ గ్రంథ్ లైన్లు చెబుతూ తాను సిగరెట్ తాగినట్లు వస్తున్న వార్తలు విని ఎంతో బాధపడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఖరాఖండీగా తేల్చిచెప్పారు.
దర్శకుడి కండిషన్.. ఆ ఫ్రేమ్‌లో సిగరెట్ లేదు!
దర్శకుడు ఆదిత్య ధర్ ఇలాంటి సెన్సిటివ్ విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉంటారని మాధవన్ గుర్తుచేశారు. ఆ పవిత్రమైన శ్లోకాలు పఠించడానికి చాలా ముందే సిగరెట్‌ను ఆర్పేయాలని దర్శకుడు తనకు స్ట్రిక్ట్‌గా చెప్పారన్నారు. ఆ సీన్‌లో తన నోటి నుంచి ఎలాంటి పొగ రాదని, చేతిలో అసలు సిగరెట్ ఉండదని.. ఆ ఫ్రేమ్‌లో ఎక్కడా ధూమపానం కనిపించదని మాధవన్ స్పష్టం చేశారు.
గోల్డెన్ టెంపుల్ సెంటిమెంట్.. హుందాతనంతో క్షమాపణ
ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తమ ఉద్దేశం కానేకాదని మాధవన్ వివరించారు. వ్యక్తిగతంగా తనకు ఒక సెంటిమెంట్ ఉందని.. తన ప్రతి సినిమా విడుదలకు ముందు తప్పకుండా గోల్డెన్ టెంపుల్‌కు వెళ్తానని మనసులోని మాట బయటపెట్టారు. సిక్కు సమాజం అంటే తనకు అమితమైన గౌరవం ఉందని తెలిపారు. పాత్ర స్వభావం కోసం సీన్ ప్రారంభంలో సిగరెట్ పట్టుకుని ఉండొచ్చు కానీ.. పవిత్ర శ్లోకాలు పఠించే సమయంలో దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసినట్లు వివరించారు. "అయినా కానీ మా వైపు నుంచి తప్పు జరిగిందని మీకు అనిపిస్తే.. నన్ను క్షమించండి" అంటూ మాధవన్ అత్యంత హుందాగా తన వివరణను ముగించారు.
తన అద్భుతమైన నటనతో ఎంతో మంది మనసులు గెలుచుకున్న మాధవన్.. ఇప్పుడు తన హుందాతనంతో క్షమాపణలు చెప్పి ఈ వివాదానికి అంతే స్టైల్‌లో ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు!
Also Read:
కుర్ర హీరోలకు సవాల్: బాక్సాఫీస్‌ను షేక్ చేయనున్న మోహన్ లాల్Akshay Kumar | ధురందర్ అడల్ట్ మూవీ.. భూత్ బంగ్లా ఫ్యామిలీ సినిమా!
Ranveer Singh Dhurandhar 2 Collections: కంటెంట్ సత్తా.. తెలుగులో ఆదరణ చూసి షాక్ లో బాలీవుడ్ మేకర్స్!
Box Office Report: ఉగాది బరిలో 'ధురంధర్ 2' సునామీ.. బాక్సాఫీస్ దాటికి విలవిలలాడుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్'
Dhurandhar 2: బాక్సాఫీస్ దగ్గర దద్దరిల్లుతున్న థియేటర్లు.. కానీ బాలీవుడ్లో ఆ అంతుచిక్కని 'నిశ్శబ్దం' వెనుక కథేంటి?

