రాత్రి పూట ఆకాశం వంక చూస్తూ.. ఈ అనంత విశ్వంలో మనం మాత్రమే ఉన్నామా? ఎక్కడో వేరే లోకంలో మనలాంటి మనుషులు ఉండే ఉంటారు కదా? అని ఎప్పుడైనా ఆలోచించారా? దశాబ్దాలుగా సామాన్యుడి మెదడును తొలిచేస్తున్న ఈ అతిపెద్ద రహస్యంపై ఇప్పుడు అమెరికా ఒక బాంబు పేల్చింది. ఏలియన్ల ఉనికికి సంబంధించి అగ్రరాజ్యం బయటపెట్టిన సంచలన ఫైళ్లు.. రేపు మన భవిష్యత్తును ఎలా మార్చబోతున్నాయో చెప్పే మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలివి!
పెంటగాన్ రహస్యాల బట్టబయలు.. ట్రంప్ సంచలనం!
ఏలియన్లు, ఆకాశంలో చక్కర్లు కొట్టే వింత వస్తువుల (UFO) గురించి ఇన్నాళ్లూ రహస్యంగా ఉన్న అమెరికా రక్షణ శాఖ 'పెంటగాన్'.. చరిత్రలో మొట్టమొదటిసారిగా తన రహస్య పత్రాలను బహిర్గతం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా ఇచ్చిన సంచలన ఆదేశాల మేరకు, ఏకంగా 161 అత్యంత రహస్య ఫైళ్లు ఇప్పుడు ప్రపంచం ముందుకొచ్చాయి.
గ్రహాంతర వాసుల పట్ల ప్రజల్లో ఉన్న తీవ్ర ఆసక్తిని దృష్టిలో ఉంచుకునే ఈ పారదర్శక నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ స్వయంగా ప్రకటించడం ఇప్పుడు భూమండలాన్ని కుదిపేస్తోంది. ఈ ఫైళ్లలో దశాబ్దాల కాలం నాటి సైనిక రికార్డులు, రహస్య అంతరిక్ష మిషన్ల నివేదికలు, సామాన్యుల నుంచి సైనికుల వరకు స్వయంగా చూసిన ప్రత్యక్ష సాక్ష్యాలు ఉండటం గమనార్హం.
అపోలో వ్యోమగాముల సాక్ష్యాలు.. చంద్రుడిపై ఆ వింత కాంతి!
ముఖ్యంగా 1960, 70వ దశకాల్లో జరిగిన ప్రతిష్టాత్మక అపోలో మిషన్లకు సంబంధించిన కళ్లు చెదిరే నిజాలు వెలుగుచూశాయి. చంద్రుడిపై అడుగు పెట్టిన రెండో మానవుడు బజ్ ఆల్డ్రిన్.. తన అంతరిక్ష యాత్రలో ఒక వింతైన కాంతిని చూసినట్లు అప్పట్లోనే వెల్లడించిన రికార్డులు ఇందులో ఉన్నాయి.
అలాగే మరో వ్యోమగామి ఎలన్ బీన్.. అంతరిక్షంలో మెరిసే కణాలు, ఫ్లాషింగ్ లైట్లను గమనించానని, అవన్నీ నేరుగా చంద్రుడి నుంచే బయటకు వస్తున్నట్లు అనిపించిందని ఆ పత్రాల్లో పేర్కొన్నారు. ఇంకో అడుగు ముందుకేసి, అంతరిక్ష వ్యోమగామి ఫ్రాంక్ బోర్మాన్ అయితే.. తన స్పేస్ క్రాఫ్ట్ దగ్గర ఒక అపరిచిత వస్తువుతో పాటు లక్షలాది మెరిసే కణాలను చూసినట్లు ఒక ఆడియో రికార్డింగ్ ద్వారా స్పష్టం చేయడం ఇప్పుడు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.
మిలటరీ కెమెరాల్లో అండాకార వస్తువు.. సిరియా టు ఇరాక్!
కేవలం వ్యోమగాముల సాక్ష్యాలే కాదు.. ఇరాక్, సిరియా, యూఏఈ లాంటి దేశాలలో అమెరికా సైన్యం స్వయంగా రికార్డ్ చేసిన కొన్ని భయానక వీడియోలను కూడా పెంటగాన్ ఇప్పుడు విడుదల చేసింది. వీటిలో ఒక అండాకారపు (Oval shape) వస్తువు ఆకాశంలో ఊహించని వేగంతో దూసుకుపోవడం స్పష్టంగా రికార్డైంది.
దీనిని పెంటగాన్ అధికారులు ‘సంభావ్య క్షిపణి’గా కొట్టిపారేసినప్పటికీ.. దాని కదలికలు మాత్రం అత్యంత వింతగా, మానవతీతంగా ఉన్నాయని వారు కూడా ఒప్పుకోక తప్పలేదు.
డెమోక్రాట్ల ఫైర్.. అదంతా రాజకీయ మైండ్ గేమేనా?
ఏలియన్ల ఫైళ్ల వ్యవహారం అమెరికా రాజకీయాల్లో ఇప్పుడు ఒక పెద్ద పెనుతుఫాను సృష్టిస్తోంది. ఈ పత్రాల విడుదలను రిపబ్లికన్ నేతలు ‘ట్రంప్ పారదర్శకతకు నిదర్శనం’ అని ఆకాశానికెత్తుతున్నారు. కానీ, డెమోక్రటిక్ నేతలు మాత్రం ఇదంతా ఒక పొలిటికల్ మైండ్ గేమ్ అని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు.
దేశంలోని అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ట్రంప్ ప్రభుత్వం ఇలా ఏలియన్ల నాటకం ఆడుతోందని వారు మండిపడుతున్నారు. అయితే, ఈ పత్రాల్లో ఉన్నవన్నీ కేవలం సాక్ష్యాలు, రికార్డులు మాత్రమేనని, వీటిని ఏలియన్ల ఉనికికి నూటికి నూరు శాతం పక్కా ఆధారాలుగా మనం భావించలేమని అధికారులు స్పష్టం చేశారు.
గ్రహాంతర వాసులు ఉన్నారా లేదా అన్నది పక్కనపెడితే.. దశాబ్దాలుగా మనకు తెలియని ఒక సమాంతర ప్రపంచాన్ని ప్రభుత్వాలు ఎలా దాచిపెడుతున్నాయో ఈ ఫైళ్లు పచ్చిగా బట్టబయలు చేశాయి. సామాన్యుడిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే.. ఆకాశంలో ఎగిరే ఆ వింత వస్తువులు ఏలియన్లవి కాకపోయినా, అవి ఏదో ఒక శత్రు దేశపు అత్యాధునిక డ్రోన్లు లేదా ఆయుధాలు అయితే మాత్రం ప్రపంచ వినాశనం ఖాయం! భూమి మీద సమస్యలు వదిలేసి అంతరిక్ష రాజకీయాలు చేస్తున్న అగ్రరాజ్యాల వైఖరి.. రేపు మానవాళి ఉనికినే ప్రమాదంలో పడేయవచ్చు. అపారమైన ఈ విశ్వంలో మనం ఒంటరి వాళ్లం కాదని భవిష్యత్తు తరాలు అధికారికంగా తెలుసుకునే రోజు ఎంతో దూరంలో లేదు!
Also Read:
Teesta River Project : భారత్కు చైనా, బంగ్లాదేశ్ షాక్సముద్రంలో అదృశ్య శత్రువు.. కరేబియన్ ప్రిన్సెస్ షిప్లో నోరోవైరస్ కలకలం!
ఇండోనేషియాలో భయానక విస్ఫోటనం: బద్దలైన మౌంట్ డుకోనో
హార్మూజ్ జలసంధిలో నెత్తురోడిన భారతీయుడు: అమెరికా, ఇరాన్ కాల్పుల్లో మృతి
Hantavirus Outbreak: క్రూయిజ్ షిప్లో ప్రాణాంతక వైరస్

