మన చుట్టూ ఉన్న గొలుసు క్రమంగా బిగుసుకుంటోందా? దశాబ్దాలుగా మనకు అత్యంత నమ్మకమైన మిత్రదేశంగా ఉన్న పక్క ఇల్లు, ఇప్పుడు అకస్మాత్తుగా డ్రాగన్ చేతుల్లోకి వెళుతోందా? సరిహద్దుల్లో తుపాకులతో కాదు, ఇప్పుడు ఏకంగా 'నీటి'తో చైనా మన దేశంపై సరికొత్త భౌగోళిక యుద్ధానికి తెరలేపుతోంది. పక్కనే ఉన్న బంగ్లాదేశ్‌లో చైనా వేస్తున్న ఈ తాజా పావులు సాధారణ పౌరుడికి వెంటనే అర్థం కాకపోవచ్చు. కానీ, రేపు మన జాతీయ భద్రతకు, ఆర్థిక వ్యవస్థకు ఇది అతిపెద్ద ముప్పుగా మారబోతోంది. అసలు తీస్తా నది సాక్షిగా ఢిల్లీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఆ మహా కుట్ర ఏంటో ప్రతి భారతీయుడూ కచ్చితంగా తెలుసుకోవాలి!
డ్రాగన్ వలలో పొరుగు దేశాలు.. చేజారిన బంగ్లాదేశ్!
ప్రస్తుతం భారత్ చుట్టూ ఉన్న పొరుగు దేశాలు రెండు వర్గాలుగా విడిపోయాయి. ఒక వర్గం భారత్‌కు అండగా నిలుస్తుండగా, మరొక వర్గం నెమ్మదిగా చైనా వైపు ఆకర్షితమవుతోంది. ఇప్పటికే నేపాల్, భూటాన్, శ్రీలంక వంటి దేశాలు ఎప్పటినుంచో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చైనాతో సంబంధాలు నెరపుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఆ ప్రమాదకరమైన జాబితాలోకి మనకు అత్యంత సన్నిహితంగా ఉండే బంగ్లాదేశ్ కూడా చేరిపోవడం దేశ భద్రతకు పెను ప్రమాదంగా మారింది.
హసీనా ఔట్, బిఎన్‌పీ ఇన్.. ఢిల్లీకి బిగ్ షాక్!
షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్నంత కాలం ఆ దేశం భారత్‌కు అత్యంత అనుకూలంగా ఉండేది. దశాబ్దాల పాటు ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగాయి. కానీ, ఇటీవల అక్కడ అధికారంలోకి వచ్చిన బిఎన్‌పీ (BNP) పార్టీ నేతలు చైనాకు అత్యంత అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ భారత్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.
తాజాగా తారిక్ రహ్మాన్ నేతృత్వంలోని బంగ్లా ప్రభుత్వం.. తీస్తా నది ప్రాజెక్టు విషయంలో తీసుకున్న సంచలన నిర్ణయం భారత్‌కు ఒక స్పష్టమైన, కఠినమైన సందేశాన్ని పంపింది. ఇది కేవలం ఒక జల ప్రాజెక్టు కాదు, చైనా ఆడుతున్న అతిపెద్ద వ్యూహాత్మక మైండ్ గేమ్!
తీస్తా ప్రాజెక్టులో చైనా ఎంట్రీ.. అసలు కుట్ర ఇదే!
తీస్తా నది తూర్పు హిమాలయాల్లో పుట్టి, సిక్కిం గుండా ప్రయాణించి బంగ్లాదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. ఆ దేశంలోని కోట్లాది మందికి వ్యవసాయం, ఉపాధి, త్రాగునీరు అందించే జీవనాడి ఈ నది. ఇప్పుడు ఈ నది పునరుద్ధరణ, నిర్వహణ ప్రాజెక్టు (TRCMRP) కోసం బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏకంగా చైనా సహకారాన్ని కోరడం దేశీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఖలీలుర్ రహ్మాన్.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ప్రత్యేకంగా భేటీ అయి చర్చించారు. ఈ చర్చల అనంతరం చైనా కూడా ఈ ప్రాజెక్టుకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం రావడం కలకలం రేపుతోంది.
భారత్‌పై నాలుగు వైపులా డ్రాగన్ దాడి!
బంగ్లాదేశ్ తీసుకున్న ఈ ఊహించని నిర్ణయం భారత్‌కు శరాఘాతం లాంటిది. ఇది ప్రధానంగా నాలుగు రకాలుగా మన దేశంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మొదటిది.. తీస్తా ప్రాజెక్టులో చైనా వేలుపెడితే, భారత్‌లోని నీటి పారుదల విధానాలపై నేరుగా తీవ్ర ప్రభావం పడుతుంది. నీటి ప్రణాళికలు, నీటి ప్రవాహం (స్టార్చ్ ఫ్లో), ఎండాకాలంలో నీటి నిర్వహణపై భారత్ తన నియంత్రణను పూర్తిగా కోల్పోతుంది.
రెండవది.. చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య త్రైపాక్షిక (త్రయస్వభావపు) సమావేశాలు, ఒప్పందాలు ప్రమాదకరంగా పెరుగుతున్నాయి. ఈ సరికొత్త కూటమి భారత్‌ను నలువైపులా చుట్టుముట్టే వ్యూహాన్ని బలపరుస్తూ, దక్షిణాసియా ప్రాంతీయ భద్రతా సమతుల్యతను తీవ్రంగా దెబ్బతీస్తోంది.
మూడవది.. బంగ్లాదేశ్‌కు చైనా ఇస్తున్న సబ్‌సిడీలు, వేల కోట్ల రుణాలు, భారీ పెట్టుబడులు భారత్‌కు ఆర్థికపరమైన స్పర్ధను పెంచుతున్నాయి. దీనివల్ల తీస్తా ప్రాజెక్టు కేవలం నది 'పునరుద్ధరణ'గా మాత్రమే మిగలదు. అది పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో చైనా ఆధిపత్యాన్ని పెంచి, ఆర్థిక ప్రభావాన్ని శాసించే అస్త్రంగా మారుతుంది. ఇక నాలుగోది.. దశాబ్దాలుగా ఉన్న ఇరు దేశాల భౌగోళిక రాజకీయ సంబంధాలు శాశ్వతంగా దెబ్బతినే ముప్పు ఏర్పడింది.
సామాన్యుడికి ఈ అంతర్జాతీయ ఒప్పందాలు, నదుల పేర్లు పెద్దగా పట్టకపోవచ్చు. కానీ, మన సరిహద్దుల్లోకి చైనా నీటి ముసుగులో వస్తోందంటే.. రేపు మన దేశ భద్రతకే ముప్పు! పాకిస్తాన్‌ను ముందుపెట్టి ఒకవైపు కవ్విస్తున్న డ్రాగన్, ఇప్పుడు బంగ్లాదేశ్‌కు అప్పులు ఇచ్చి తీస్తా నదిని తన గుప్పిట్లోకి తీసుకుంటోంది. భారత్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్న ఈ తరుణంలో.. కేవలం దౌత్యపరమైన ప్రకటనలతో సరిపెట్టకుండా, ఢిల్లీ నాయకత్వం అత్యంత కఠినమైన వ్యూహాలతో బదులివ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పొరుగుదేశాల వ్యవహారాల్లో మనం ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా, భవిష్యత్తులో దేశం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు!
Also Read:
Tamil Nadu Politics : సీఎం కుర్చీ వెనుక స్టాలిన్ మాస్టర్ మైండ్!బెంగాల్ సీఎంగా సువేందు: 30 లక్షల ఓట్లు గల్లంతు చేశారన్న అభిషేక్ బెనర్జీ!
దళపతికి కొత్త టెన్షన్: గవర్నర్ భేటీలో సినీ నిర్మాత ఎంట్రీ వెనుక మతలబు ఏంటి?
దశాబ్దాల కమ్యూనిస్టు, దీదీ కోట బద్దలు.. బెంగాల్ సీఎంగా సువేందు అట్టహాసంగా ప్రమాణం!
తమిళనాట రిసార్ట్ పాలిటిక్స్: 40 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల తరలింపు

.webp)