మెగాస్టార్ చిరంజీవి మాస్ అవతారం చూసి చాలా కాలమైంది. అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఆ వింటేజ్ ఎనర్జీని తిరిగి తీసుకురావడానికి దర్శకుడు బాబీ కొల్లి సిద్ధమయ్యారు. 'వాల్తేరు వీరయ్య' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న #Mega158 ప్రాజెక్ట్ నుంచి అదిరిపోయే గ్లింప్స్ వచ్చేసింది. ఈ సినిమాకు 'కాకా' (Kaaka) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఒక సింపుల్ సూపర్ వైజర్ క్యారెక్టర్‌తో మొదలై, గన్స్ పేల్చే మాస్ డాన్‌గా మారే ఈ గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
[FEATURED_IMAGE]
కూల్ సూపర్ వైజర్ వెనుక 'కాకా' మాస్ హిస్టరీ!
తాజాగా విడుదలైన ఈ వీడియో గ్లింప్స్ మెగా అభిమానుల్లో అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఆక్వా ఫ్యాక్టరీలో ‘కె. సత్యం’ అనే సూపర్ వైజర్‌గా చిరంజీవి ఎంట్రీ ఇస్తారు. ఒకవైపు ఫోన్లో మాట్లాడుతూ లోడ్ సకాలంలో పంపిస్తానని చెప్తూనే, మరోవైపు పండుగ టార్గెట్ ఉందని సునీల్ లీవ్ క్యాన్సిల్ చేయడం లాంటి సీన్స్ చాలా న్యాచురల్‌గా అనిపిస్తాయి.
కానీ ఆ సాధారణ క్యారెక్టర్ వెనుక అసలు కథ వేరే ఉంది. గెటప్ శ్రీను స్కూటర్ కీస్ నీటిలో పడిపోగా, వాటిని మాగ్నెట్ సాయంతో బయటకు తీసే క్రమంలో తుపాకులు బయటపడటం ఈ గ్లింప్స్‌కే హైలైట్. అద్దాలు ధరించిన ‘కె. సత్యం’ రూపంలో ఉన్న మెగాస్టార్.. ఆ వెంటనే ‘కాకా’ టైటిల్‌తో పవర్‌ఫుల్ మాస్ గెటప్‌లో కనిపించడం గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. గన్స్ పేలుస్తూ చిరంజీవి ఇచ్చిన వింటేజ్ మాస్ పోజ్ ఫ్యాన్స్‌కు పండగ లాంటి ట్రీట్.
ఎస్. తమన్ మ్యూజిక్ మ్యాజిక్.. 2027 సంక్రాంతికి రచ్చ!
బాబీ మరోసారి చిరంజీవిలోని మాస్ అండ్ క్లాస్ వేరియేషన్లను పర్ఫెక్ట్‌గా ఒడిసిపట్టారు. విజువల్స్ పరంగా సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ కన్నన్ వర్క్ రిచ్‌గా ఉంది. ముఖ్యంగా ఎస్. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అందులో వింటేజ్ ‘గ్యాంగ్ లీడర్’ నాటి ఐకానిక్ "గ్యాంగ్ గ్యాంగ్" రీమిక్స్ బీట్ కలపడం పూనకాలు తెప్పిస్తోంది. అనస్వర రాజన్, నివేథా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం రాబోతోంది.
చాలా రోజులుగా చిరంజీవి నుంచి అభిమానులు కోరుకుంటున్నది పక్కా వింటేజ్ లుక్ అండ్ మాస్ ఎనర్జీ. దర్శకుడు బాబీ ఈ 'కాకా' గ్లింప్స్‌తో దానికి పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు. కూల్ సూపర్ వైజర్ పాత్ర నుంచి స్టైలిష్ వింటేజ్ డాన్‌గా మారే ఈ ట్రాన్స్ఫర్మేషన్ గనక వర్కౌట్ అయితే 2027 సంక్రాంతి బరిలో రికార్డులు బద్దలవ్వడం ఖాయం. వాల్తేరు వీరయ్యను మించిన కమర్షియల్ బొమ్మను బాబీ రెడీ చేస్తున్నాడని ఈ గ్లింప్స్ స్పష్టం చేస్తోంది.
