‘ఖైదీ’, ‘విక్రమ్’ లాంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఇప్పుడు 'డీసీ' సినిమాతో హీరోగా మారి బాక్సాఫీస్ వద్ద ఊహించని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఇటీవల ‘లియో’, ‘కూలీ’ సినిమాలతో దర్శకుడిగా విమర్శల పాలైన ఆయన, ఎవరికీ అంచనాలు లేని ఈ చిత్రంలో 'దేవదాస్' పాత్రలో అద్భుతమైన సటిల్ పెర్ఫామెన్స్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
[FEATURED_IMAGE]
సౌత్ ఇండియాలో స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్. 'మానగరం'తో మొదలైన ఆయన ప్రయాణం 'విక్రమ్' సినిమా సృష్టించిన ఎల్సీయూ (LCU) తో శిఖరాగ్రానికి చేరుకుంది. అయితే ఆ తర్వాత వచ్చిన 'లియో', ఇటీవల విడుదలైన 'కూలీ' సినిమాలు ప్రేక్షకులను దారుణంగా నిరాశపరిచాయి. ఈ వరుస పరాజయాలతో లోకేష్ పై ప్రేక్షకుల్లో ఉన్న నమ్మకం సన్నగిల్లింది. అల్లు అర్జున్ తో ఆయన కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటికీ అభిమానుల్లో మునుపటి రేంజ్ ఎగ్జైట్మెంట్ కనిపించలేదు.
సరిగ్గా ఇలాంటి కష్టకాలంలో లోకేష్ కనగరాజ్ మెగాఫోన్ పక్కనపెట్టి ఏకంగా హీరోగా కెమెరా ముందుకు రావడం సంచలనంగా మారింది. 'డీసీ' అనే చిత్రంలో హీరోగా ఆయన పరిచయం అయ్యారు. అయితే ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి రిలీజ్ అయ్యే వరకు ఎక్కడా సరైన బజ్ లేదు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులైతే లోకేష్‌కు హీరోగా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిగా లైట్ తీసుకున్నారు.
కానీ థియేటర్లలోకి అడుగుపెట్టాక సీన్ పూర్తిగా రివర్స్ అయింది. 'డీసీ'లో దేవదాస్ అనే పాత్రలో లోకేష్ తన సటిల్ యాక్టింగ్ తో ప్రేక్షకులను కట్టిపడేశాడు. పెద్దగా హావభావాలు ప్రదర్శించకుండానే, పాత్రలో పూర్తిగా ఒదిగిపోయి స్క్రీన్ ప్రెజెన్స్ తో మ్యాజిక్ చేశాడు. అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు రోజురోజుకూ కలెక్షన్లు పెంచుకుంటూ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. దర్శకుడిగా తీవ్రంగా నిరాశపరిచిన లోకేష్, హీరోగా మాత్రం అనూహ్య విజయాన్ని నమోదు చేసి బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ ట్విస్ట్ ఇచ్చాడు.

