ది ఒడిస్సీ బాక్సాఫీస్: 1 బిలియన్ డాలర్ల క్లబ్‌లో నోలన్ మూవీ

naveen
By -

The Odyssey movie

ఫ్రాంచైజీ, సూపర్ హీరో ఇమేజ్ లేకుండానే హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన విజువల్ వండర్ ‘ది ఒడిస్సీ’ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం మూడు వారాల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వన్ బిలియన్ డాలర్ల వసూళ్లను సాధించి రికార్డులకెక్కింది. పూర్తిగా ఐమాక్స్ (IMAX) 70mm కెమెరాలతో రూపొందిన ఈ చిత్రం, నోలన్ బ్రాండ్ పవర్‌ను ఇండస్ట్రీకి మరోసారి రుచిచూపించింది.


[FEATURED_IMAGE]

సినిమా అంటే ఒక ఫ్రాంచైజీ లేదా సూపర్ హీరోల క్యారెక్టర్లు ఉంటేనే వేల కోట్లు కొల్లగొడతాయనే ఫార్ములాను క్రిస్టోఫర్ నోలన్ బద్దలు కొట్టాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని ‘ది ఒడిస్సీ’ కేవలం నోలన్ అనే బ్రాండ్ నేమ్‌తో బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. ఓపెనింగ్ వీకెండ్‌లోనే 264 మిలియన్ డాలర్లు రాబట్టి నోలన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ గ్లోబల్ ఓపెనర్‌గా నిలిచింది. కంటెంట్‌తో పాటు థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను నమ్ముకున్న ఈ చిత్రం అనతికాలంలోనే వన్ బిలియన్ డాలర్ల క్లబ్‌లో దర్జాగా అడుగుపెట్టింది.


ఈ అద్భుత విజయానికి ప్రధాన కారణం సరికొత్త టెక్నాలజీ అని చెప్పాలి. పూర్తిగా ఐమాక్స్ 70mm ఫిల్మ్ కెమెరాలతో థియేట్రికల్ రిలీజ్ అయిన తొలి సినిమాగా ‘ది ఒడిస్సీ’ చరిత్రకెక్కింది. దీని ప్రభావం కలెక్షన్స్‌పై స్పష్టంగా కనిపించింది. కేవలం ఐమాక్స్ స్క్రీన్ల ద్వారానే తొలి వీకెండ్‌లో 52 మిలియన్ డాలర్లు రావడం విశేషం. భారీ విజువల్స్, ప్రీమియం స్క్రీన్స్, నోలన్ బ్రాండ్ కలిసి ఈ భారీ విజయాన్ని సాధ్యం చేశాయి. ఒక డైరెక్టర్ పేరుతో ఇలాంటి వసూళ్లు రావడం హాలీవుడ్ స్టూడియోలకు ఒక కొత్త ఫార్ములాను పరిచయం చేస్తోంది.

ఇవి కూడా చదవండి (Also Read)
డేర్‌డెవిల్ మల్టీస్టారర్: ఒకే ఫ్రేమ్‌లో అజిత్, వెంకీ, మోహన్‌లాల్? నాగార్జున 100వ సినిమా: ఆగస్టు 29న స్పెషల్ గ్లింప్స్‌!

వన్ బిలియన్ మార్క్ అనేది ఒక అరుదైన ఫీట్ అయినా, బాక్సాఫీస్ టాప్ ప్లేస్‌కు చేరుకోవాలంటే ఇది సరిపోదు. 'అవతార్', 'అవెంజర్స్', 'టైటానిక్' లాంటి విజువల్ వండర్స్ 2 బిలియన్ డాలర్ల మార్కును దాటి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాయి. మరి ఆ క్లబ్‌లో నోలన్ ఏ రేంజ్ రికార్డులు సెట్ చేస్తాడనేది ఆసక్తికరం. ఏదేమైనా భవిష్యత్తులో కేవలం ఫ్రాంచైజీల పైనే కాకుండా, ఇలాంటి డైరెక్టర్ల బ్రాండ్ వాల్యూ పై భారీగా పెట్టుబడులు పెట్టేందుకు నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.