ఒకప్పుడు బ్లాక్‌బస్టర్ సినిమాలతో స్టార్ ప్రొడ్యూసర్‌గా వెలుగొందిన ఎంఎస్ రాజు, తాజాగా దర్శకత్వం వహించిన మిస్టిక్ హారర్ థ్రిల్లర్ 'అగధ' రేపు థియేటర్లలోకి రాబోతోంది. కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్‌లో, ముఖ్యంగా హైదరాబాద్‌లోని ప్రీమియర్ షోలకు అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంటూ బాక్సాఫీస్ వద్ద సర్ప్రైజ్ హిట్ కొట్టే దిశగా దూసుకుపోతోంది.
[FEATURED_IMAGE]
'ఒక్కడు', 'వర్షం', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' లాంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు, రూటు మార్చి డైరెక్టర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సంగతి తెలిసిందే. 'డర్టీ హరి' లాంటి బోల్డ్ అటెంప్ట్ తర్వాత ఆయన ఇప్పుడు 'అగధ' అనే పూర్తిస్థాయి మిస్టిక్ హారర్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ భిన్నమైన ప్రయోగంపై ముందు నుంచే సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
'మా ఊరి పొలిమేర' సిరీస్, 'ఓం భీమ్ బుష్' చిత్రాలతో ప్రేక్షకులను భయపెట్టిన కామాక్షి భాస్కర్ల ఈ సినిమాలో మెయిన్ లీడ్ చేస్తుండటం సినిమాకు అతిపెద్ద బలం. కామాక్షితో పాటు 'రుద్రమదేవి' ఫేమ్ ఉల్కా గుప్తా, శ్రవణ్ రెడ్డి, జోవిక విజయ్‌కుమార్, సీనియర్ నటుడు భానుచందర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మించిన ఈ చిత్రానికి అజయ్ కేఆర్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
సినిమా అవుట్‌పుట్ పై ఉన్న నమ్మకంతో మేకర్స్ హైదరాబాద్‌లోని ఏఏఏ (అల్లు) సినిమాస్‌లో ముందుగా ప్రీమియర్ షోలను ప్లాన్ చేశారు. అయితే, ఊహించని విధంగా ఈ షోల టికెట్లు క్షణాల్లో అమ్ముడైపోవడంతో డిమాండ్ మేరకు మరిన్ని షోలను యాడ్ చేశారు. యాడ్ చేసిన కొత్త షోలు కూడా ఫాస్ట్-ఫిల్లింగ్ మోడ్‌లో ఉండటం చూస్తుంటే, హారర్ థ్రిల్లర్స్ చూసే ఆడియన్స్ 'అగధ' కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్థమవుతోంది. ఈ పాజిటివ్ బజ్‌తో రేపు ఉదయం థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

