తారక్ రెస్ట్.. సెప్టెంబర్ రెండో వారం నుంచి షూట్!
ఇటీవల ఎన్టీఆర్ చేతికి గాయం కావడంతో సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే తారక్ పూర్తిగా కోలుకునే వరకు సినిమా షూటింగ్‌ను ఆపకూడదని ప్రశాంత్ నీల్ నిర్ణయించారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ అవసరం లేని సన్నివేశాలను ముందుగా చిత్రీకరించాలని ప్లాన్ చేశారు.
సెప్టెంబర్ రెండో వారం నుంచి ప్రారంభమయ్యే ఈ కొత్త షెడ్యూల్‌లో ఇతర నటీనటుల కాంబినేషన్ సీన్స్, కొన్ని కీలకమైన టాకీ పార్ట్స్ తీయనున్నట్లు సమాచారం. హీరో లేని పోర్షన్ అంతా కంప్లీట్ చేసి, తారక్ పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆయనకు సంబంధించిన షూటింగ్‌ను కొనసాగించనున్నారని తెలుస్తోంది.
డార్క్ షేడ్స్‌కు గుడ్ బై.. కలర్‌ఫుల్ విజువల్స్!
ఈ సినిమా గురించి వినిపిస్తున్న మరో క్రేజీ అప్‌డేట్ ఏంటంటే.. ప్రశాంత్ నీల్ తన రెగ్యులర్ మేకింగ్ స్టైల్‌ను పూర్తిగా మార్చేస్తున్నారు. సాధారణంగా ఆయన తీసిన సినిమాల్లో డార్క్ టోన్స్, బ్లాక్ అండ్ గ్రే షేడ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. కానీ 'డ్రాగన్' ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌ను మాత్రం పూర్తిగా భిన్నమైన కలర్ ప్యాలెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు ఫుల్ కలర్‌ఫుల్‌గా, రిచ్ విజువల్స్‌తో సాగుతాయట. ఈ ఎపిసోడ్స్‌లో డార్క్ షేడ్స్‌కు పెద్దగా చోటు ఉండదని, ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులకు కూడా ప్రశాంత్ నీల్ ఒక సరికొత్త విజువల్ ట్రీట్ ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
ప్రశాంత్ నీల్ సినిమాల్లో యాక్షన్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో, డార్క్ థీమ్ వల్ల స్క్రీన్ అంతా ఒకేలా అనిపిస్తుందనే రిమార్క్ కూడా ఉంది. ఇప్పుడు ఆ కంప్లైంట్‌ను చెరిపేస్తూ 'డ్రాగన్' ఫ్లాష్‌బ్యాక్ కోసం రిచ్ కలర్‌ఫుల్ విజువల్స్ ప్లాన్ చేయడం నిజంగా మాస్టర్ స్ట్రోక్. తారక్ మాస్ యాక్షన్‌కు, నీల్ సరికొత్త విజువల్ ప్యాలెట్ తోడైతే థియేటర్లలో సరికొత్త రికార్డులు బద్దలవ్వడం ఖాయం.

