చిరంజీవి లైనప్‌లో కన్ఫ్యూజన్.. ఆ సినిమా సమ్మర్‌కు వెళ్లనుందా?

naveen
By -

చిరంజీవి 'విశ్వంభర' vs 'కాకా'

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న రెండు భారీ చిత్రాలు 'విశ్వంభర', 'కాకా' రిలీజ్ డేట్స్ చుట్టూ టాలీవుడ్‌లో ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. సంక్రాంతి బరిలో జనవరి 13, 2027న ‘కాకా’ రాబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించగా, వీఎఫ్‌ఎక్స్ పనుల వల్ల ఆలస్యమవుతున్న ‘విశ్వంభర’ను కూడా జనవరి 9న దించాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకే హీరో నటించిన రెండు సినిమాలు కేవలం నాలుగు రోజుల వ్యవధిలో రావడం అసాధ్యం కావడంతో, ఒక సినిమా సమ్మర్‌కు వాయిదా పడటం ఖాయంగా కనిపిస్తోంది. మెగాస్టార్ తీసుకోబోయే ఫైనల్ డెసిషన్ పైనే ఈ సినిమాల రిలీజ్ ఆధారపడి ఉంది.

[FEATURED_IMAGE]

బాస్ ఈజ్ బ్యాక్ అంటూ మెగా అభిమానులు కాలర్ ఎగరేసేలా మెగాస్టార్ చిరంజీవి లైనప్ ఇప్పుడు అదిరిపోయింది. వరుసగా రెండు భారీ బడ్జెట్ సినిమాలు సెట్స్ పైన ఉండటంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. కానీ, ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ గురించే పెద్ద హాట్ టాపిక్ నడుస్తోంది. వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’, అలాగే బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘కాకా’.. ఈ రెండింటిలో సంక్రాంతికి వచ్చేది ఏది? సమ్మర్‌కు వెళ్లేది ఏది? అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.


నిజానికి డైరెక్టర్ బాబీ, చిరంజీవి కాంబినేషన్‌కు ఇండస్ట్రీలో ఒక స్పెషల్ క్రేజ్ ఉంది. గతంలో వీళ్ల కలయికలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి సీజన్‌లో ఎంతటి బ్లాక్‌బస్టర్ సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అదే సెంటిమెంట్‌తో ఇప్పుడు ‘కాకా’ సినిమాను కూడా 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే మరోపక్క, భారీ వీఎఫ్‌ఎక్స్ పనుల కారణంగా ‘విశ్వంభర’ దసరా రేస్ నుంచి తప్పుకుని, నేరుగా 2027 జనవరి 9వ తేదీన సంక్రాంతి బరిలోకే దిగబోతోందనే ప్రచారం గట్టిగా ఊపందుకుంది.


దీంతో కేవలం నాలుగు రోజుల వ్యవధిలో మెగాస్టార్ నటించిన రెండు సినిమాలు థియేటర్లలోకి రావడం ప్రాక్టికల్‌గా సాధ్యం కాదు కాబట్టి, ఇందులో ఒక సినిమా రేసు నుంచి తప్పుకోవడం పక్కా అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కమర్షియల్ మీటర్‌కు పూర్తి భిన్నంగా గ్రాఫిక్స్‌తో వస్తున్న ‘విశ్వంభర’కు కచ్చితంగా సోలో రిలీజ్ విండో కావాలి. అలాగే 'కాకా' మేకర్స్ కూడా తమకున్న సంక్రాంతి సెంటిమెంట్‌ను వదులుకోవడానికి ఇష్టపడట్లేదని ఇన్‌సైడ్ టాక్.


ఈ పరిస్థితుల నేపథ్యంలో ‘కాకా’ను సంక్రాంతికి ఫిక్స్ చేసి, ‘విశ్వంభర’ సినిమాను 2027 సమ్మర్ సీజన్‌కు పోస్ట్ పోన్ చేసే దిశగా నిర్మాతలు సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. ప్రస్తుతం ఈ రిలీజ్ డేట్స్ వ్యవహారం మొత్తం మెగాస్టార్ చిరంజీవి కోర్టులో ఉంది. బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా ఎప్పుడు రావాలన్న దానిపై ఆయన తీసుకోబోయే ఫైనల్ డెసిషన్ కోసం మెగా అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.