బిగ్ బాస్ షో అంటే కేవలం కంటెస్టెంట్ల మధ్య గొడవలు మాత్రమే కాదు, కోట్లాది రూపాయల వ్యాపారం! ఈ రియాలిటీ షోను తమ భుజాలపై మోస్తూ, వీకెండ్స్‌లో భారీ టీఆర్పీ రేటింగ్స్ తెచ్చిపెడుతున్న స్టార్ హోస్ట్‌ల రెమ్యునరేషన్స్ ఇప్పుడు ఇండియన్ టెలివిజన్‌ను షేక్ చేస్తున్నాయి. 2026 నాటికి సల్మాన్ ఖాన్ (రూ.200 కోట్లు) మొదలుకుని మన నాగార్జున (రూ.35 కోట్లు), విజయ్ సేతుపతి వరకు తీసుకుంటున్న పారితోషికాల వివరాలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ఒక వీకెండ్ ఎపిసోడ్‌కు వీరు తీసుకుంటున్న ఈ భారీ మొత్తాలు చూస్తే సామాన్యుడి మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం.
[FEATURED_IMAGE]బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షో సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఇంట్లో ఉండే కంటెస్టెంట్లు ఆడే ఆట ఒకెత్తయితే, వారాంతంలో వచ్చి వాళ్ల క్లాస్ పీకే హోస్ట్‌ల రేంజ్ మరో ఎత్తు. కేవలం తమ స్టార్‌డమ్‌తో ఆడియన్స్‌ను టీవీలకు కట్టిపడేస్తున్న ఈ సూపర్ స్టార్లకు, మేకర్స్ ఇస్తున్న రెమ్యునరేషన్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సామాన్యులు జీవితకాలంలో కనీసం ఊహించలేని స్థాయిలో ఈ స్టార్స్ ఒక్కో సీజన్‌కు కోట్లు వెనకేసుకుంటున్నారు.
ఈ పారితోషికాల రేసులో బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ దరిదాపుల్లో ఎవరూ లేరు. సీజన్ 4 నుంచి హిందీ బిగ్ బాస్‌ను ఒంటిచేత్తో నడిపిస్తున్న ఆయన, ఏకంగా రూ.200 కోట్లకు పైగా ఛార్జ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ కోడై కూస్తోంది. ఇక బెంగాలీ బిగ్ బాస్ కోసం క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ ఎంట్రీ ఇవ్వగా, ఆయనతో నాలుగేళ్ల పాటు ఇతర క్విజ్ షోలతో కలిపి ఏకంగా రూ.125 కోట్లకు డీల్ కుదిరినట్లు తెలుస్తోంది.
దక్షిణాదిలోనూ ఈ మనీ మ్యాజిక్ తక్కువేమీ లేదు. కమల్ హాసన్ స్థానంలో తమిళ బిగ్ బాస్ పగ్గాలు చేపట్టిన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, ఒక్కో వీకెండ్‌కి రూ.3 నుంచి 4 కోట్లు తీసుకుంటూ, టోటల్ సీజన్‌కి దాదాపు రూ.80 కోట్లు అందుకుంటున్నారట. మరోవైపు తెలుగులో నాగార్జున క్రేజ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. సీజన్ 3కి పది కోట్లతో మొదలైన ఆయన జర్నీ, ఇప్పుడు ఏకంగా రూ.35 కోట్లకు చేరుకున్నట్లు సమాచారం.
అలాగే మలయాళంలో మొదటి నుంచి హోస్ట్‌గా ఉన్న కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ ఒకప్పుడు రూ.12 కోట్లు తీసుకోగా, ఇప్పుడు ఆ నంబర్ రూ.30 కోట్లకు చేరింది. కన్నడలో కిచ్చా సుదీప్ కూడా సీజన్‌కు రూ.20 కోట్లు అందుకుంటున్నట్లు టాక్. వాస్తవానికి ఈ లెక్కలపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ లేకపోయినా, ఈ రేంజ్‌లో రెమ్యునరేషన్స్ ఇవ్వడం షోకి వస్తున్న లాభాలకు అద్దం పడుతోంది. బిగ్ బాస్ బ్రాండ్ వాల్యూ పెరుగుతున్న కొద్దీ, రాబోయే సీజన్లలో ఈ హీరోల పారితోషికాలు ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడతాయో చూడాలి.

