టాలీవుడ్‌తో పాటు కన్నడ, తమిళం, హిందీ చిత్ర పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రష్మిక మందన్న. తన కెరీర్‌లో ఎక్కువగా స్టార్ హీరోల సరసన నటించి మెప్పించారు. అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, మహేష్ బాబు, కార్తీ, విజయ్, ధనుష్, సిద్ధార్థ్ మల్హోత్రా, అమితాబ్ బచ్చన్, విక్కీ కౌశల్, రణ్‌బీర్ కపూర్, సల్మాన్ ఖాన్, రక్షిత్ శెట్టి, పునీత్ రాజ్‌కుమార్, దర్శన్, ధృవ సర్జా వంటి ప్రముఖ నటులతో రష్మిక స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
రష్మిక తన సినీ ప్రయాణాన్ని కన్నడ సినిమా ‘కిరిక్ పార్టీ’తో ప్రారంభించారు. ఈ చిత్రంలో ఆమె కన్నడ స్టార్ రక్షిత్ శెట్టితో కలిసి నటించారు. ఆ తర్వాత పునీత్ రాజ్‌కుమార్‌తో కలిసి ‘అంజని పుత్ర’ సినిమాలో కనిపించారు. గోల్డెన్ స్టార్ గణేష్‌తో ‘చమక్’లో సందడి చేశారు. దర్శన్‌తో ‘యజమాన’, ధృవ సర్జాతో ‘పొగరు’ వంటి విజయవంతమైన చిత్రాల్లోనూ నటించారు.
టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ‘గీత గోవిందం’ సినిమా రష్మిక కెరీర్‌ను మలుపు తిప్పిందని చెప్పడంలో సందేహం లేదు. ఈ చిత్రం ఆమెకు తెలుగులో విపరీతమైన ప్రజాదరణను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’లో మహేష్ బాబు సరసన నటించారు. అల్లు అర్జున్‌తో కలిసి ‘పుష్ప’ మరియు ‘పుష్ప 2’ చిత్రాల్లో నటించి పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నారు. నేచురల్ స్టార్ నాని మరియు నాగార్జునతో కలిసి ‘దేవదాసు’లోనూ మెరిశారు.
తమిళంలో కార్తీతో కలిసి ‘సుల్తాన్’ సినిమాలో నటించిన రష్మిక, విజయ్‌తో ‘వారసుడు’ చిత్రంలో దళపతి సరసన కనిపించారు. ఇక ఇప్పుడు ధనుష్‌తో కలిసి ‘కుబేర’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు.
బాలీవుడ్‌లో రష్మిక ‘మిషన్ మజ్ను’ సినిమాతో పరిచయమయ్యారు. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించారు. అమితాబ్ బచ్చన్‌తో కలిసి ‘గుడ్‌బై’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. విక్కీ కౌశల్‌తో ‘ఛావా’ మరియు రణ్‌బీర్ కపూర్‌తో ‘యానిమల్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల్లోనూ నటించారు. ఇటీవల విడుదలైన సల్మాన్ ఖాన్ ‘సికందర్’ సినిమాలో కూడా రష్మిక నటించారు. అయితే, ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.