సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు హీరోలకు సమానంగా పారితోషికం అందుకుంటూ స్టార్‌లుగా రాణిస్తున్నారు. హీరోలకు ఏమాత్రం తీసిపోని నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కొంతమంది హీరోయిన్లు ఇప్పుడు కోట్లలో రెమ్యునరేషన్ అందుకుంటూ నిర్మాతలకు పెద్ద షాక్ ఇస్తున్నారు.
ఇక పైన కనిపిస్తున్న స్టార్ హీరోయిన్ మాత్రం ఇప్పుడున్న హీరోయిన్లందరిలో అగ్రస్థానంలో ఉంది. సినిమాల్లోనే కాదు రెమ్యునరేషన్ విషయంలోనూ ఆమె తోపు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి నటించిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? ఈ పాన్ ఇండియా స్టార్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇంతకూ ఆమె ఎవరంటే...
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా - బాలీవుడ్ టూ హాలీవుడ్!
ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు హీరోలకు మించి రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. అలాంటి వారిలో ప్రియాంక చోప్రా ఒకరు. ఈ ముద్దుగుమ్మ గ్లోబల్ స్టార్‌గా రాణిస్తోంది. బాలీవుడ్‌లో తిరుగులేని హీరోయిన్‌గా ఎదిగిన ప్రియాంక, హాలీవుడ్‌లోనూ సినిమాలు చేసింది. బాలీవుడ్‌లోనే ఆమె అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్. ఆ తర్వాత హాలీవుడ్‌లో అడుగు పెట్టి అక్కడ కూడా స్టార్‌గా వెలుగొందుతోంది. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన 'జంజీర్' సినిమాలో హీరోయిన్‌గా చేసింది.
తెలుగులో 'తుఫాన్' - బాలీవుడ్‌లో బిజీ!
'జంజీర్' సినిమా తెలుగులో 'తుఫాన్'గా విడుదలైంది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ప్రియాంక చోప్రా పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిన్నది బాలీవుడ్‌లో ఒక సినిమా చేస్తోంది. హృతిక్ రోషన్ హీరోగా నటించిన 'క్రిష్ 2', 'క్రిష్ 3'లో ప్రియాంక హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు 'క్రిష్ 4'లో కూడా నటిస్తోంది. ఈ సినిమాకు హృతిక్ రోషన్ దర్శకుడిగానూ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రియాంక రూ. 30 కోట్లు అందుకుంటుందని సమాచారం. అలాగే ప్రియాంక చోప్రా మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తుందని కూడా తెలుస్తోంది. ఈ సినిమా కోసం ప్రియాంక రూ. 30 కోట్లు అందుకుంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
0 కామెంట్‌లు