బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండికి ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. గత కొంతకాలంగా బంగారం, వెండి ధరలు నిరంతరంగా పెరుగుతూ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్‌ల ప్రభావంతో స్టాక్ మార్కెట్లు, బంగారం, ముడి చమురు ధరలు తీవ్ర ఒడిదుడుకులకు గురవుతున్నాయి. భారీగా పతనం తర్వాత రెండు రోజుల క్రితం బంగారం ధర గణనీయంగా తగ్గింది.
అయితే, అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల కారణంగా బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు వస్తుంటాయి. కొన్నిసార్లు ధరలు పెరుగుతుంటే, మరికొన్నిసార్లు తగ్గుతుంటాయి. తాజాగా, బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.
07 ఏప్రిల్ 2025, సోమవారం ఉదయం ఆరు గంటల వరకు వివిధ వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.83,090 గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,650 గాను ఉంది. వెండి కిలో ధర రూ.99,900 లుగా ఉంది. 10 గ్రాముల బంగారంపై రూ.10 మేర, వెండి కిలోపై రూ.100 మేర ధర తగ్గింది. అయితే, ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉంటాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి:
బంగారం ధరలు:
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.83,090, 24 క్యారెట్ల ధర రూ.90,650 గా ఉంది.
విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.83,090, 24 క్యారెట్ల ధర రూ.90,650 గా ఉంది.
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.83,240, 24 క్యారెట్ల ధర రూ.90,800 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.83,090, 24 క్యారెట్ల ధర రూ.90,650 గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.83,090, 24 క్యారెట్ల ధర రూ.90,650 గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.83,090, 24 క్యారెట్ల ధర రూ.90,650 గా ఉంది.
వెండి ధరలు:
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,02,900
విజయవాడ, విశాఖపట్నంలో రూ.1,02,900
ఢిల్లీలో వెండి కిలో ధర రూ.93,900 లుగా ఉంది.
ముంబైలో రూ.93,900 గా ఉంది.
బెంగళూరులో రూ.93,900
చెన్నైలో రూ.1,02,900 లుగా ఉంది.