సమంత డేటింగ్ రూమర్స్: రాజ్ నిడిమోరు భార్య రియాక్షన్!


స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా మారి 'శుభం' సినిమాతో విజయం సాధించింది. గత కొంతకాలంగా మాయోసైటిస్‌తో బాధపడుతున్న సమంత, సినిమాలకు బ్రేక్ తర్వాత మళ్లీ బిజీ అవుతోంది. ఇదిలా ఉండగా, దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ చేస్తుందంటూ వార్తలు వస్తున్నాయి.

రాజ్ నిడిమోరుతో సమంత సన్నిహిత ఫోటోలు

'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్‌తో పాపులర్ అయిన రాజ్ నిడిమోరుతో సమంత కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత నిర్మాతగా వ్యవహరించిన 'శుభం' సినిమాకు రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇటీవల సమంత షేర్ చేసిన ఫోటోల్లో రాజ్ నిడిమోరుతో ఆమె సన్నిహితంగా ఉండటం కనిపించింది. ఒక ఫోటోలో ఫ్లైట్‌లో రాజ్ భుజంపై తల వాల్చి నవ్వుతూ సెల్ఫీ దిగింది.

రాజ్ నిడిమోరు భార్య పరోక్ష పోస్ట్

రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ వార్తలపై ఆయన భార్య తాజాగా ఒక పోస్ట్ షేర్ చేశారు. "నా గురించి ఆలోచించే వారు ఉన్నందుకు సంతోషంగా ఉంది. వారికి నా ఆశీర్వాదాలు, ప్రేమను పంపుతున్నా.. ఎవరైతే నా గురించి ఆలోచిస్తున్నారో, నన్ను చూస్తున్నారో, నా గురించి మాట్లాడుకుంటున్నారో, నా గురించి చదువుతున్నారో.. వారందరూ నన్ను కలవండి" అంటూ ఆమె పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. అయితే ఈ పోస్ట్ సమంత గురించేనా అనే దానిపై స్పష్టత లేదు.