తమిళ అగ్ర నటుడు విశాల్ ఆదివారం (మే 11) రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విల్లుపురం జిల్లా కూవాగంలోని కూత్తాండవర్ ఆలయంలో జరిగిన ట్రాన్స్‌జెండర్ల అందాల పోటీ ‘మిస్ కూవాగం 2025’ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన వేదికపై ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయారు.
ఘటన వివరాలు
చిత్తిరై ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ అందాల పోటీల్లో విశాల్ అందరినీ పలకరిస్తూ నిలబడి ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో అక్కడ ఉన్నవారంతా ఆందోళనకు గురయ్యారు. వెంటనే ప్రథమ చికిత్స అందించిన తర్వాత ఆయన కళ్లు తెరిచారు. అనంతరం మాజీ మంత్రి పొన్ముడి ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
గతంలోనూ అనారోగ్యం
కొన్ని నెలల క్రితం ‘మద గజ రాజా’ సినిమా ప్రమోషన్ల సమయంలోనూ విశాల్ బాగా బలహీనంగా కనిపించారు. అప్పట్లో ఆయన సరిగా మాట్లాడలేని స్థితిలో ఉండటంతో ఆయన ఆరోగ్యంపై అనేక ఊహాగానాలు వచ్చాయి. అయితే, అది వైరల్ జ్వరం వల్ల వచ్చిందని ఆయన టీమ్ అప్పట్లో తెలిపింది.
ప్రస్తుత పరిస్థితి
ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో విశాల్ చికిత్స పొందుతున్నారు. కొన్నాళ్లపాటు ఆయనకు పూర్తి విశ్రాంతి అవసరమని, భోజనం మానకూడదని వైద్యులు సూచించారు. ఈ ఘటనతో తమిళ సినీ పరిశ్రమలో ఆందోళన నెలకొంది.
கூட்டத்தில் மயங்கி விழுந்த விஷால்... விழுப்புரத்தில் பரபரப்பு#vishal | #thanthicinema | #villupuram pic.twitter.com/DgrXSOv9FU
— Thanthi TV (@ThanthiTV) May 11, 2025
0 కామెంట్‌లు