Cow Milk vs Buffalo Milk | ఆవు పాలు vs గేదె పాలు: ఏవి మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి?

surya
By -
0

 


పాలలో మన శరీరానికి అవసరమైన అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా, విటమిన్ డి మరియు కాల్షియం వంటివి పుష్కలంగా ఉండి, ఎముకలు, దంతాలను దృఢంగా చేయడంలో సహాయపడతాయి. అందుకే ప్రతిరోజూ పాలు తాగాలని సూచిస్తుంటారు. అయితే, ఇక్కడే చాలామందికి ఒక సందేహం వస్తుంది: ఆవు పాలు మంచివా? గేదె పాలు మంచివా? ఈ రెండింటి మధ్య తేడాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొవ్వు శాతం

పాలలో ఉండే కొవ్వుపై వాటి చిక్కదనం ఆధారపడి ఉంటుంది.

ఆవు పాలలో 3-4 శాతం మాత్రమే కొవ్వు ఉంటుంది.

గేదె పాలలో 7-8 శాతం వరకు కొవ్వు ఉంటుంది.

అందుకే ఆవు పాల కంటే గేదె పాలు చిక్కగా ఉంటాయి. అధిక కొవ్వు శాతం వల్ల గేదె పాలు అరగడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది.

ప్రోటీన్ శాతం

ఆవు పాలతో పోలిస్తే గేదె పాలలో 10-11 శాతం ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ప్రోటీన్లు ఎక్కువగా ఉండటం వల్ల ఇవి అధిక వేడిని తట్టుకుంటాయి. అందుకే నవజాత శిశువులు మరియు వృద్ధులకు గేదె పాలు తాగించకూడదని సాధారణంగా చెబుతుంటారు, ఎందుకంటే అవి జీర్ణం కావడం కష్టం.

కొలెస్ట్రాల్ మరియు కేలరీలు

కొలెస్ట్రాల్: ఆవు పాలతో పోలిస్తే గేదె పాలలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. అందువల్ల, ఊబకాయం, రక్తపోటు, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఆవు పాల బదులు గేదె పాలు తాగడం మంచిది.

కేలరీలు: గేదె పాలల్లోనే కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కేలరీలతో పాటు ప్రోటీన్లు, కొవ్వు అధికంగా ఉంటాయి. ఒక గ్లాసు గేదె పాలలో సుమారు 237 కేలరీలు ఉంటే, ఒక గ్లాసు ఆవు పాలలో కేవలం 148 కేలరీలు మాత్రమే ఉంటాయి.

నిల్వ సామర్థ్యం & రంగు

నిల్వ సామర్థ్యం: గేదె పాలలో పెరాక్సిడేస్ అనే ఎంజైమ్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆవు పాలతో పోలిస్తే గేదె పాలు ఎక్కువ సమయం నిల్వ ఉంటాయి. ఆవు పాలను రెండు రోజులలోపే తాగాలి.

రంగు: ఆవు పాలు పసుపు-తెలుపు రంగులో ఉంటాయి. గేదె పాలు తెలుపు లేదా క్రీమ్ రంగులో ఉంటాయి. గేదె పాలలోని బీటా-కెరోటిన్ రంగులేని విటమిన్ ఎ గా మారుతుంది, అందుకే గేదె పాలలో పసుపు రంగు తగ్గుతుంది. ఆవు పాలలో కూడా బీటా-కెరోటిన్ ఉంటుంది, కానీ తక్కువ మోతాదులో ఉంటుంది.

ఇతర ఉపయోగాలు

మంచి నిద్ర కోసం: మంచి నిద్ర పోవాలంటే రాత్రి పూట గేదె పాలు తాగడం మంచిది.

పాడి ఉత్పత్తులకు: కోవా, పెరుగు, నెయ్యి, పన్నీర్, పాయసం వంటివి చేయడానికి గేదె పాలు మంచివి.

స్వీట్ల తయారీకి: ఆవు పాలలో తక్కువ క్రీమ్ ఉంటుంది కాబట్టి స్వీట్ల తయారీకి వీటిని ఉపయోగించవచ్చు.

ఆవు పాలు, గేదె పాల మధ్య తేడా ఉన్నప్పటికీ, ఈ రెండూ ఆరోగ్యానికి మంచివే. రెండింటిలోనూ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే, మన అవసరాలను బట్టి ఆవు పాలు కావాలా, గేదె పాలు కావాలా అన్నది నిర్ణయించుకోవాలి.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!