ఆరోగ్యానికి ఆరు సూత్రాలు: ఇంట్లో ఆహారం తింటూ బరువు తగ్గడం ఎలా?

surya
By -
0

ఇంటి వంట ఎవరికి నచ్చదు? రుచికి దాసోహమై ఒక్కోసారి అదుపు లేకుండా లాగించేస్తూ ఉంటాం. ఫలితంగా బరువు పెరగడంతోపాటు ఇతర ఆరోగ్య సమస్యలూ తలెత్తుతాయి. మరి ఇంట్లో ఆహారాన్ని పరిమితంగా తింటూ ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో చూద్దాం.

ఆరోగ్యానికి ఆరు సూత్రాలు

కార్బోహైడ్రేట్లు తగ్గించండి: ఆహారంలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండేలా చూసుకోండి. ఇవి బరువు పెరుగుదలకు ప్రధాన కారణం.

మంచి పిండిపదార్థాలు ఎంచుకోండి: బ్రౌన్ రైస్, బ్రౌన్ బ్రెడ్‌లకు ప్రాధాన్యం ఇవ్వండి. వీటిలోని సంక్లిష్ట పిండిపదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండండి: జంక్ ఫుడ్ వెంటనే నోరూరిస్తుంది, కానీ వాటితో ఆరోగ్య సమస్యలు తప్పవు. బదులుగా తాజా కాయగూరలు, పండ్లు, ఆకుకూరలకు ప్రాధాన్యం ఇవ్వండి. గుడ్డు, పాలు, పెరుగు తీసుకోవడం కూడా చాలా మంచిది.

నీరు పుష్కలంగా తాగండి: నీళ్లు తాగడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగడం మర్చిపోకండి.

తినేటప్పుడు ఏకాగ్రత ముఖ్యం: తినేటప్పుడు టీవీ, సెల్‌ఫోన్ చూడొద్దు. తిండిపైనే దృష్టి పెట్టండి. రంగు, రుచి, వాసనను ఆస్వాదిస్తూ తింటేనే అది శరీరానికి పడుతుంది.

నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి: నిద్ర అలవాట్లు కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, మేల్కొనడం అలవర్చుకోవాలి. అలాగే నిద్రకు గంట ముందు ఫోన్‌ను దూరంగా ఉంటే మంచిది.

ఈ సూత్రాలను పాటిస్తూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండండి. మీరు ఇంకేమైనా ఆరోగ్య చిట్కాలు పాటిస్తారా? క్రింద కామెంట్ల రూపంలో తెలియజేయండి.



Tags:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!