చాలా మందికి వేడి వేడి ఆహారం తినడం అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా వర్షాకాలంలో వేడి వేడి అన్నం లేదా ఇతర ఆహార పదార్థాలను తినడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. కానీ, ఆరోగ్య నిపుణుల ప్రకారం, ఇలా అతిగా వేడి ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీని వల్ల కలిగే నష్టాలను ఇప్పుడు తెలుసుకుందాం.
65 డిగ్రీల కంటే ఎక్కువ వేడి: ప్రమాదం!
65 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న ఆహార పదార్థాలు లేదా పానీయాలు తీసుకోవడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా, అన్నవాహికలోని సున్నితమైన పొర కాలిపోతుంది. దీని వలన భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకే, ఎట్టి పరిస్థితుల్లోనూ అతిగా వేడి ఉండే ఆహారాలు తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
కడుపులో మంట, క్యాన్సర్ ప్రమాదం
కొన్నిసార్లు వేడి వేడి ఆహారం లేదా టీ, కాఫీ వంటి పానీయాలు తాగుతున్నప్పుడు నాలుక లేదా కడుపులో వేడిగా, కాలినట్లు అనిపిస్తుంది. ఇలాంటి సందర్భాలలో మరోసారి వేడి ఆహారం అస్సలు తీసుకోకూడదు. దీని వలన కడుపులో మంట, కణజాలంలో మార్పులు సంభవించి, క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
శరీర హెచ్చరికలను గుర్తించండి
కొన్నిసార్లు వేడి వేడి అన్నం తినాలంటే ఇబ్బంది ఏర్పడుతుంది. ముఖ్యంగా నాలుక చాలా సున్నితంగా కాలినట్లు అనిపించడంతో ఆహారం తీసుకోవడం కష్టమవుతుంది. అయితే అలాంటి సందర్భాల్లో వేడి వేడి అన్నం అస్సలు తీసుకోకూడదు. ఇది మీ శరీరానికి ఒక హెచ్చరికగా భావించాలి. లేకపోతే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ధూమపానం, మద్యపానం చేసేవారు మరింత జాగ్రత్త!
ధూమపానం మరియు మద్యపానం చేసేవారు వేడి వేడి ఆహారాన్ని అస్సలు తీసుకోకూడదు. పొగాకు వలన నోటిలోని శ్లేష్మ పొర ఇప్పటికే ప్రభావితమై ఉంటుంది. అటువంటి సమయంలో వేడి వేడి ఆహారం తీసుకోవడం వలన సమస్య మరింత ఎక్కువై నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
మీరు వేడి ఆహారం తినే అలవాటు ఉందా? ఈ విషయాలు తెలిసిన తర్వాత మీ అలవాటును మార్చుకోవాలని అనుకుంటున్నారా?
0 కామెంట్‌లు