Spiritual story | దానం విలువ: సాధువు చెప్పిన అష్టావక్ర గీత రహస్యం

naveen
By -
0

ఒక ఆధ్యాత్మిక సాధువు భక్తి గీతాలు పాడుకుంటూ గ్రామంలోకి అడుగుపెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న ఒక గృహిణి ఆ సాధువును తన ఇంటికి సాదరంగా ఆహ్వానించింది. ఆమె పూలు, పండ్లు సమర్పించి, ఆయన పాదాలకు నమస్కరించి, కొన్ని మంచి మాటలు చెప్పమని కోరింది. సాధువు అష్టావక్ర గీతలోని ముఖ్యమైన విషయాలను వివరిస్తున్నాడు.

ఆకలితో అలమటిస్తున్న యాచకుడు

ఇంతలో, ఇంటి ముందు ఒక యాచకుడు నిలబడి "అమ్మా, ఆకలి!" అని గట్టిగా అరిచాడు. ఆ గృహిణి విననట్లు ఉండిపోయింది. యాచకుడి అరుపు ఆమెకు వినిపించలేదేమో అని భావించిన సాధువు, అతను ఇంకా అక్కడే నిలబడి ఉండటం గమనించాడు. తను చెబుతున్న ప్రవచనాన్ని ఆపి, "పాపం... కొంచెం దానం చేయండమ్మా!" అని కోరాడు. వండిన పదార్థాలు తమ కుటుంబ సభ్యులకే సరిపోవని ఆమె బదులిచ్చింది. అయినా సాధువు ఓపికగా, "అలా అనకమ్మా! ఆకలితో ఉన్నట్లున్నాడు. పాపం... కొంత దానం చేయండమ్మా" అన్నాడు. "అతను ఎప్పుడూ వచ్చే వాడే, రేపు ఎప్పుడైనా దానం చేస్తానులే" అని ఆ ఇల్లాలు చెప్పింది.

దానం - పాప పరిహారం

సాధువు నవ్వుతూ, "మీరు పాపపుణ్యాలను నమ్ముతారా?" అని ఆమెను ప్రశ్నించాడు. "ఎందుకు నమ్మను... పాపాలు చేసినవారు నరకానికి వెళ్తారని, పుణ్యాలు చేసినవారు స్వర్గానికి వెళ్తారని చిన్నప్పటినుంచీ వింటున్నాను" అని ఆమె బదులిచ్చింది. "అవి నమ్మేటప్పుడు... దానం చేస్తే చేసిన పాపం కొంత కొట్టుకుపోతుందని కూడా తెలిసి ఉంటుంది కదా?" అన్నాడు సాధువు.

"మనం తెలిసో తెలియకో ఎన్నో పాపాలు చేస్తుంటాం. ఎందరి మనసులనో బాధపెట్టి ఉంటాం. కొన్నింటిని మాత్రమే గుర్తించగలం, అన్నిటినీ గుర్తించలేం. మంచో చెడో అతను యాచిస్తున్నాడు. మిమ్మల్ని నేను ఆ యాచకుడికి కొత్తగా దానం చేయమని అడగడం లేదు. చేసిన పాపాన్నే ఆహార రూపంలో దానం చేయమంటున్నాను. దానం చేసేటప్పుడు ఇచ్చే చేయి ఎప్పుడూ పైన ఉంటుంది అని తెలుసుకో" అన్నాడు సాధువు.

జ్ఞానోదయం

సాధువు మాటల లోతైన అర్థం ఆమెకు స్ఫురించింది. దానం చేయని చేయి, కాయలు కాయని చెట్టు రెండూ ఒకటేనని ఆమె గ్రహించింది. వెంటనే, కొద్దిగా ఆహారాన్ని యాచకుడికి వేయడానికి వంటగదిలోకి వెళ్లింది. దానం చేయడం వల్ల కలిగే ఆధ్యాత్మిక ప్రశాంతతను, ఆత్మ సంతృప్తిని ఆమె అనుభవంలోకి తెచ్చుకుంది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!