బాక్సాఫీస్ దగ్గర ఒకేసారి 11 సినిమాలు క్యూ కట్టాయి! ఈ శుక్రవారం థియేటర్లలో జరగబోయే ఈ 'ట్రాఫిక్ జామ్'లో గెలిచేది ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
ఈ నెల 21న టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాల జాతర జరగనుంది. ఏకంగా 11 సినిమాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వస్తుండటం విశేషం. వీటిలో పెద్ద స్టార్ హీరోల సినిమాలు లేకపోయినా, కొన్ని కంటెంట్ ఉన్న చిత్రాలపై ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా 'రాజు వెడ్స్ రాంబాయి', '12A రైల్వే కాలనీ' వంటి చిత్రాలు కాస్త నోటబుల్ రిలీజ్‌లుగా కనిపిస్తున్నాయి.
ఈ రేసులో ఉన్న ప్రధాన చిత్రాలు ఇవే:
రాజు వెడ్స్ రాంబాయి: చిన్న చిత్రాల లక్కీ హ్యాండ్ వంశీ నందిపాటి రిలీజ్ చేస్తున్న సినిమా ఇది. హార్డ్ హిట్టింగ్ క్లైమాక్స్ తో వస్తున్న ఈ సినిమా, రిలీజ్ తర్వాత గట్టి సౌండ్ చేస్తుందని ట్రేడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
12A రైల్వే కాలనీ: వరుస సినిమాలు చేస్తున్నా సరైన ఓపెనింగ్స్ దక్కని అల్లరి నరేష్, ఈ సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. టాక్ బాగుంటే కలెక్షన్స్ రాబట్టే సత్తా నరేష్‌కు ఉంది.
పాంచ్ మినార్: రాజ్ తరుణ్ కూడా హిట్ కోసం మొహం వాచిపోయి ఉన్నాడు. ట్రైలర్ ఆకట్టుకోవడంతో, పాజిటివ్ టాక్ వస్తే ఆడియెన్స్ థియేటర్ల వైపు చూసే ఛాన్స్ ఉంది.
ప్రేమంటే: బ్యాక్ టు బ్యాక్ ప్లాపుల్లో ఉన్న ప్రియదర్శి, ఏషియన్ సినిమాస్ నిర్మించిన ఈ సినిమాపైనే భారీ ఆశలు పెట్టుకున్నాడు.
వీటితో పాటు కలివి వనం, శ్రీమతి 21F, జనతాబార్, ఇట్లు మీ ఎదవ వంటి స్ట్రైట్ సినిమాలతో పాటు.. క్షమాపణ గాద 21, మఫ్టీ పోలీస్ 21, మాస్క్ 21 వంటి డబ్బింగ్ చిత్రాలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.
మొత్తానికి 11 సినిమాలు బరిలో దిగుతున్నా, కంటెంట్ ఉన్న సినిమానే ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ శుక్రవారం బాక్సాఫీస్ రద్దీలో ఏ సినిమా హిట్ టాక్ తెచ్చుకుని నిలబడుతుందో చూడాలి.

