రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న 'వారణాసి' సినిమా బడ్జెట్ లెక్కలు తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే! ముఖ్యంగా జక్కన్న రెమ్యునరేషన్ వింటే.. ఇండియన్ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డు అని ఒప్పుకుంటారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న గ్లోబల్ అడ్వెంచర్ సినిమా 'వారణాసి' కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్ ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాల మధ్య 2027 సమ్మర్‌లో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా బయటకు వచ్చిన రెమ్యునరేషన్ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
రుద్రుడికి రూ. 100 కోట్లు.. లాభాల్లో వాటా!
ఇటీవలే గ్రాండ్‌గా జరిగిన అనౌన్స్‌మెంట్ ఈవెంట్‌లో విడుదల చేసిన టీజర్, మహేష్ బాబు లుక్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించాయి. ఈ సినిమాలో 'రుద్ర' పాత్రలో కనిపించనున్న మహేష్ బాబు, ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా రూ. 100 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం. అంతేకాకుండా, సినిమా లాభాల్లో కూడా ఆయనకు వాటా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.
జక్కన్న రెమ్యునరేషన్.. ఏకంగా రూ. 200 కోట్లు?
అందరికంటే షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ కోసం రాజమౌళి తీసుకుంటున్న పారితోషికం. ఆయన ఏకంగా రూ. 200 కోట్లు తీసుకుంటున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఒక ఇండియన్ డైరెక్టర్‌కు ఈ స్థాయి రెమ్యునరేషన్ దక్కడం ఇదే తొలిసారి కావచ్చు.
మందాకిని, కుంభలకు ఎంతంటే?
ఈ సినిమాలో 'మందాకిని'గా నటిస్తున్న బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రాకు రూ. 30 కోట్లు, విలన్ 'కుంభ' పాత్రలో నటిస్తున్న మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్‌కు రూ. 20 కోట్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది.
రూ. 1200 కోట్ల బడ్జెట్!
ఈ సినిమాను రూపొందించడానికి దాదాపు 3 ఏళ్లు పడుతుంది కాబట్టి, స్టార్స్ ఈ స్థాయి పారితోషికం తీసుకోవడంలో ఆశ్చర్యం లేదని అంటున్నారు. మొత్తం సినిమా బడ్జెట్ ఏకంగా రూ. 1200 కోట్లతో తెరకెక్కుతోందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
రాజమౌళి విజన్, మహేష్ బాబు క్రేజ్ కలిస్తే బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వడం ఖాయం. ఈ భారీ రెమ్యునరేషన్లు, బడ్జెట్ లెక్కలు చూస్తుంటే 'వారణాసి' ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించడం గ్యారెంటీగా కనిపిస్తోంది.

