ఆ ఆసీస్ ప్లేయర్.. ఇప్పుడు ఇండియాకు ఆడాలనుకుంటోందా?

naveen
By -

 ఆస్ట్రేలియా క్రికెట్ ప్లేయర్.. మన పంజాబీ కుర్రాడి ప్రేమలో పడింది! ఇప్పుడు ఏకంగా టీమిండియా జెర్సీ వేసుకుంటానంటూ సంచలనం రేపుతోంది.


Amanda Wellington's engagement to Indian man.


ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టుకు చెందిన ప్రతిభావంతమైన లెగ్‌ స్పిన్నర్ అమండా వెల్లింగ్టన్ (Amanda Wellington) త్వరలోనే భారత దేశంతో కుటుంబ బంధం కలుపుకోబోతున్నారు. పంజాబ్‌కు చెందిన యువకుడు హంరాజ్‌తో ఆమె వివాహం నిశ్చయమైంది. కొద్ది రోజుల క్రితం వీరిద్దరి ఎంగేజ్‌మెంట్‌ ఘనంగా జరిగింది. ఈ శుభవార్తను అమండా స్వయంగా సోషల్ మీడియాలో పంచుకోవడంతో క్రికెట్ ప్రపంచం నుంచి వారికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.


దిల్జిత్ కచేరీలో మొదలైన ప్రేమ!

అమండా, హంరాజ్ పరిచయం చాలా ఆసక్తికరంగా జరిగింది. ఆస్ట్రేలియాలో జరిగిన ప్రముఖ పంజాబీ గాయకుడు దిల్జిత్ దోసాంజ్ సంగీత కచేరీలో వీరిద్దరూ తొలిసారి కలుసుకున్నారు. ఆ కచేరీకి దిల్జిత్‌కు జెర్సీని బహుమతిగా అందించేందుకు వెళ్లిన అమండా, అక్కడ హంరాజ్‌ను కలుసుకున్నారు. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారి, ఇప్పుడు వివాహ బంధం వరకు చేరుకుంది.


"భారత్ తరఫున ఆడాలని ఉంది": అమండా

వివాహం తర్వాత అమండా వెల్లింగ్టన్ చేసిన వ్యాఖ్యలు భారత అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపాయి. “వివాహం తర్వాత నాకు ఒకవేళ భారత పౌరసత్వం లభిస్తే, భారత్ తరఫున క్రికెట్ ఆడాలని చాలా ఆసక్తిగా ఉంది” అని ఆమె తన మనసులోని మాటను వెల్లడించారు. తన లెగ్ స్పిన్ ప్రతిభతో టీమ్‌ ఇండియాకు సేవ చేసే అవకాశం దొరికితే చాలా సంతోషిస్తానని ఆమె పేర్కొన్నారు.


ఆసీస్ జట్టులో దక్కని అవకాశాలు

లెగ్ స్పిన్‌తో బ్యాటర్లను బురిడీ కొట్టించడంలో అమండా వెల్లింగ్టన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే, అమండాకు కొంతకాలంగా ఆస్ట్రేలియా జాతీయ జట్టులో అవకాశాలు దక్కడం లేదు. అయినప్పటికీ, ఆమె విమెన్స్ బిగ్ బాష్ లీగ్ (WBBL)లో మాత్రం అడిలైడ్ స్ట్రైకర్స్ తరఫున ఆడుతూ స్థిరంగా రాణిస్తున్నారు.


అమండా–హంరాజ్ వివాహ వార్త, ఆమె భారత జట్టు తరఫున ఆడాలనే కోరిక.. ఇప్పుడు ఇండియా, ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. భవిష్యత్తులో అమండా టీమ్ ఇండియా జెర్సీ ధరించే అవకాశం ఉంటే, అది క్రికెట్‌లో ఒక అరుదైన ఘట్టం అవుతుందని అభిమానులు చర్చించుకుంటున్నారు.


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!