పవన్‌పై భూమన సెటైర్లు: పులస చేపలకు నివాసం?

naveen
By -

 

పవన్‌పై భూమన వ్యంగ్యాస్త్రాలు

పవన్‌పై భూమన వ్యంగ్యాస్త్రాలు: "పులస చేపలకు శాశ్వత నివాసం కల్పించండి"

హైదరాబాద్: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పులికాట్ సరస్సులో ఫ్లెమింగో పక్షులకు శాశ్వత నివాసం కల్పించాలని పవన్ పేర్కొనడాన్ని ప్రస్తావిస్తూ, ఆయనపై సెటైర్లతో విరుచుకుపడ్డారు.


భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. "పులికాట్ సరస్సులో ఫ్లెమింగో పక్షులకు శాశ్వత నివాసం కల్పించాలని మీరు అనడం అభినందనీయం. మీ పేరులోనే పవనం, కల్యాణం రెండూ ఉన్నాయి," అని అన్నారు. "అదేవిధంగా, సైబీరియా నుంచి వందల ఏళ్లుగా వలస వచ్చే ఫ్లెమింగోల తరహాలోనే, వందల కిలోమీటర్లు ప్రయాణించి గోదావరికి వచ్చే పులస చేపలకు కూడా శాశ్వత నివాసం కల్పించాలని కోరుతున్నాం" అని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా, "ఏప్రిల్, మే నెలల్లో శీతల వాతావరణాన్ని మీ అధీనంలో ఉంచుకుని రాష్ట్రంలో శాశ్వతంగా చల్లదనం ఉండేలా చూడాలి" అని వ్యంగ్యంగా వ్యాఖ్యనించారు.


"ప్రకృతిని శాసించే శక్తి మీకు కలగాలి"

సనాతన ధర్మ పరిరక్షకులుగా పవన్ కల్యాణ్ ఇంకా ఎన్నో చేయాలని భూమన చురకలంటించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రమాదాలు జరగకుండా రోడ్లు వేయాలని, దేవాలయాల్లో ప్రమాదాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, మద్యం మత్తులో అనర్థాలు జరగకుండా చూడాలని సూచించారు.


"మీరు గాల్లో పక్షుల్ని, నీటిలో చేపల్ని కూడా మీ ఆధీనంలోకి తీసుకోవాలని అనుకోవడం అభినందనీయం. ప్రకృతిని శాసించే శక్తి మీకు కలగాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నా," అని అన్నారు. ఇప్పటికే మీ జ్ఞాన తృష్ణ ప్రజలకు అర్థం అయ్యిందని భూమన వ్యాఖ్యానించారు.



డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఈ వ్యంగ్య వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. పర్యావరణ అంశాలపై రాజకీయ నాయకులు చేసే ఇలాంటి వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లలో పంచుకోండి.


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!