Amaravati Quantum Valley: 88 వేల జాబ్స్, బాబు కొత్త రికార్డ్

naveen
By -

Amaravati Quantum Valley

Amaravati Quantum Valley: అమరావతిలో సరికొత్త చరిత్ర.. 88 వేల ఉద్యోగాలు, ప్రపంచం మన వైపు చూసేలా బాబు ప్లాన్!


ఒకప్పుడు 'సైబరాబాద్'తో ప్రపంచ ఐటీ మ్యాప్‌లో తెలుగు వారి సత్తా చాటారు. ఇప్పుడు 'క్వాంటమ్' టెక్నాలజీతో మరోసారి చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా శనివారం ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. భవిష్యత్ ప్రపంచాన్ని శాసించే క్వాంటమ్ కంప్యూటింగ్ రంగానికి భారత్ నుండే సవాల్ విసిరేలా.. 'అమరావతి క్వాంటమ్ వ్యాలీ' (Amaravati Quantum Valley) కి పునాదిరాయి పడింది. 88 వేల ఉద్యోగాలు, దిగ్గజ కంపెనీల రాకతో ఏపీ రూపురేఖలు మారబోతున్నాయా?


ఉద్దండరాయునిపాలెంలో టెక్నాలజీ పండగ

తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో కేటాయించిన 50 ఎకరాల్లో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ శనివారం శంకుస్థాపన చేశారు. ఐబీఎం (IBM), టీసీఎస్ (TCS), ఎల్ అండ్ టి (L&T) వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలు ఇందులో భాగస్వాములుగా ఉండటం ఈ ప్రాజెక్టు స్థాయిని తెలియజేస్తోంది. నారా లోకేశ్, ఇతర మంత్రులు ఈ చారిత్రక ఘట్టానికి సాక్షులుగా నిలిచారు.


ఇండియాలోనే ఫస్ట్.. 133 క్యూబిట్ పవర్!

ఈ ప్రాజెక్టు హైలైట్ ఏంటంటే.. భారతదేశంలోనే మొట్టమొదటి 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్‌ (133 Qubit Quantum Computer) ను ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. సాధారణ కంప్యూటర్ల కంటే వేల రెట్లు వేగంగా పనిచేసే ఈ టెక్నాలజీ.. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, రక్షణ, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. ఆగస్టు నాటికి భవనం పూర్తి చేసి, డిసెంబర్ కల్లా కంప్యూటర్ ను అందుబాటులోకి తేవాలన్నది సర్కార్ టార్గెట్.


బోస్టన్, సింగపూర్ సరసన అమరావతి

"1990లలో ఐటీలో లీడర్ గా నిలిచాం.. ఇప్పుడు క్వాంటమ్ లో ప్రపంచాన్ని శాసిద్దాం" అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. అమరావతిని బోస్టన్, షాంఘై, సింగపూర్ వంటి గ్లోబల్ క్వాంటమ్ కేంద్రాల సరసన నిలబెట్టడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. కేవలం భవనాలు కట్టడమే కాదు, ఇక్కడ జరిగే పరిశోధనలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాలన్నది బాబు మాస్టర్ ప్లాన్.


88 వేల ఉద్యోగాలు.. యువతకు పండగే!

అన్నింటికంటే ముఖ్యంగా.. ఈ ఒక్క ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 88,000 ఉద్యోగాలు (88,000 Jobs) వస్తాయని అంచనా. ఇది ఏపీ యువతకు నిజంగా గుడ్ న్యూస్. టెక్నాలజీతో పాటు ఉపాధి కూడా జత కలిస్తే రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం మారిపోవడం ఖాయం.


విజన్ 2026 కాదు.. విజన్ ఫ్యూచర్! 

రాళ్లు వేయడం కామన్.. కానీ భవిష్యత్తుకు పునాది వేయడం స్పెషల్. అమరావతి క్వాంటమ్ వ్యాలీ అనుకున్న టైమ్ కు పూర్తయితే.. ఇండియా టెక్ హిస్టరీలో ఏపీ కొత్త పేజీ లిఖించినట్లే.


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!