బంగారం ధర: వచ్చే ఏడాది $5,000? మైండ్ బ్లాక్ అయ్యే అంచనా!

naveen
By -

బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వార్త వింటే మీ గుండె ఆగిపోవచ్చు.. వచ్చే ఏడాది రేట్లు ఊహించని స్థాయికి చేరబోతున్నాయి!


Gold bars and coins stacked with a rising financial graph background.


బంగారం ధర ఇప్పట్లో దిగివచ్చేలా లేదు సరికదా, వచ్చే ఏడాది సరికొత్త రికార్డులను తిరగరాయడానికి సిద్ధమవుతోంది. ప్రపంచ స్వర్ణ మండలి (WGC) సీఈఓ డేవిడ్ టైట్ దుబాయ్ కాన్ఫరెన్స్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర ఏకంగా 5,000 డాలర్ల భారీ మార్కును తాకవచ్చని జోస్యం చెప్పారు.


ఎందుకింత పెరుగుదల?

గత అక్టోబరులో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర 4,381 డాలర్ల వద్ద ఆల్‌టైం రికార్డు సృష్టించగా, ప్రస్తుతం అది 4,150 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అయితే, ఈ పరుగు 5,000 డాలర్ల వైపు వెళ్లడానికి ప్రధానంగా మూడు బలమైన కారణాలు కనిపిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు:

  • అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉండటం.

  • అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా మాంద్యం లేదా సంక్షోభం వైపు వెళ్తుండటం.

  • వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు భవిష్యత్ భద్రత కోసం పోటీపడి మరీ బంగారాన్ని నిల్వ చేసుకోవడం.


జపాన్‌లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం కూడా బులియన్ మార్కెట్‌కు కలిసొచ్చే అంశం. కేవలం డబ్ల్యూజీసీ మాత్రమే కాదు, గోల్డ్‌మన్‌ శాక్స్‌, జేపీ మోర్గాన్‌, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా వంటి అంతర్జాతీయ ఆర్థిక దిగ్గజాలు కూడా వచ్చే ఏడాది బంగారం 5,000 డాలర్ల స్థాయికి చేరడం ఖాయమని బల్లగుద్ది చెబుతున్నాయి. అంటే రాబోయే రోజుల్లో సామాన్యుడికి బంగారం ఇక అందని ద్రాక్షే కావచ్చు.


Tags: