హైదరాబాద్ మెట్రో భారం.. టికెట్లు డబుల్?

surya
By -
0

 

మెట్రో గుదిబండ

మెట్రో గుదిబండ.. టికెట్ ధర రూ.100 దాటే అవకాశం?

హైదరాబాద్: ఆదాయం కంటే నిర్వహణ, అప్పుల భారమే ఎక్కువగా ఉన్న హైదరాబాద్ మెట్రో గుదిబండను మోయలేక, ప్రభుత్వం ఇప్పుడు దానిని ఓ ప్రైవేటు సంస్థకు కట్టబెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ అప్పుల భారాన్ని నగరవాసులపై మోపి, టికెట్ చార్జీలను ముక్కు పిండి వసూలు చేసేందుకు అడుగులు పడుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


ప్రభుత్వం నెత్తిన రూ. 15 వేల కోట్ల భారం

నగరంలో 67 కిలోమీటర్ల మేర అందుబాటులో ఉన్న మెట్రో రైలు ద్వారా నిత్యం 5.5 లక్షల మంది ప్రయాణిస్తున్నా, అంచనాలకు తగినట్లుగా రెవెన్యూ రావడం లేదు. దీంతో ప్రారంభం నుంచే అప్పుల భారంతో నడుస్తున్న ఎల్&టీ సంస్థ, రూ. 6.5 వేల కోట్ల అప్పులతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో రూ. 13.5 వేల కోట్లతో కలిపి మొత్తం రూ. 15 వేల కోట్ల భారాన్ని స్వాధీనం చేసుకుంది.


ఈ వ్యవహారం తర్వాత, ఏటా రూ. 600 కోట్లుగా ఉన్న నష్టాలు, ఇప్పుడు నిర్వహణ, వడ్డీల భారంతో కలిపి ఏటా రూ. 1300-1400 కోట్లకు పెరగనున్నాయి. 2024-25 మెట్రో ఆర్థిక నివేదిక కూడా నిర్వహణ ఖర్చులే అధికంగా ఉన్నాయని తేల్చింది.


నగరవాసులపై 'టికెట్' భారం

ఈ భారీ నష్టాలన్నింటినీ పూడ్చుకోవడానికి ప్రజలపై భారం మోపడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రాగానే టికెట్ ధరలను 50 శాతం పెంచిన విధానాన్నే ఇక్కడా అమలు చేశారు, దీంతో గరిష్ట టికెట్ ధర రూ. 70లకు చేరింది. ఇప్పుడు ఈ పెరిగిన నష్టాలను తట్టుకోవాలంటే, ప్రస్తుత టికెట్ ధరలను వంద శాతం పెంచినా, బ్రేక్ ఈవెన్ రావడానికి కనీసం 30-35 ఏళ్లు పడుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అంటే, రాబోయే రోజుల్లో గరిష్ట టికెట్ ధర ఏకంగా రూ. 100 దాటే అవకాశం ఉంది. ఈ భారాన్ని మోయడం ఎందుకని, సర్కారు మొత్తం నిర్వహణను ఓ ప్రైవేటు సంస్థకు కట్టబెట్టే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం.


విస్తరణ పేరుతో మరిన్ని అప్పులు.. భూముల అమ్మకం?

ప్రస్తుతం ఉన్న అప్పులు చాలవన్నట్లు, ప్రభుత్వం రెండో దశ విస్తరణలో భాగంగా 144 కిలోమీటర్ల మేర పొడిగించేందుకు రూ. 45 వేల కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రభుత్వం వద్ద చిల్లి గవ్వ లేకుండానే ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టడంతో, భారీగా వడ్డీలకు అప్పులు తేవాల్సి ఉంటుంది. ఈ అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు, టికెట్ ధరలు పెంచడంతోపాటు, మెట్రోకు ఉన్న విలువైన భూములను అడ్డికి పావుశేరు చొప్పున విక్రయించడం లేదా దీర్ఘకాలిక లీజు ప్రతిపాదికన రేవంత్ సన్నిహితులకు కట్టబెట్టే యోచనలో సర్కారు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.



మెట్రో విస్తరణ పేరుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అనాలోచితంగా కనిపిస్తున్నాయని, చివరికి ఈ భారం టికెట్ల రూపంలో నగరవాసులపైనే పడనుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం ప్రైవేటు సంస్థకు కట్టబెట్టడం సరైన నిర్ణయమేనని మీరు భావిస్తున్నారా? ఈ అప్పుల భారం, టికెట్ల పెంపుపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లలో పంచుకోండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!