'ఐబొమ్మ' రవి విచారణలో సంచలనాలు: నెదర్లాండ్స్ లింక్!

moksha
By -
0

 తెలుగు సినీ పరిశ్రమను కంటి మీద కునుకు లేకుండా చేసిన 'ఐబొమ్మ' వెబ్‌సైట్ అడ్మిన్ ఇమ్మడి రవి విచారణలో పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు తెలుస్తున్నాయి. ఐదు రోజుల కస్టడీలో భాగంగా, తొలిరోజే పోలీసులు రవి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు.


ఐబొమ్మ రవి విచారణ.. దిమ్మతిరిగే నిజాలు!


విదేశీ సర్వర్లు, క్రిప్టో కరెన్సీ.. తీగ లాగితే డొంక కదిలింది!

సీసీఎస్ (CCS) పోలీసులు ప్రధానంగా రవి బ్యాంక్ లావాదేవీలు, నెట్‌వర్క్, ఇంటర్నెట్ సోర్స్‌పై దృష్టి సారించారు. విచారణలో బయటపడ్డ అంశాల ఆధారంగా రవిపై 'ఫారెనర్స్ యాక్ట్' సెక్షన్‌ను కూడా అదనంగా చేర్చారు. ఎందుకంటే, రవి కేవలం సినిమాలే కాకుండా బెట్టింగ్ యాప్స్‌ను కూడా ప్రమోట్ చేసినట్లు తేలింది. ఈ క్రమంలో ఎన్.ఆర్.ఇ (NRE) ఖాతాలు, క్రిప్టో కరెన్సీ, పలు ఆన్‌లైన్ వాలెట్లు, దేశీయ బ్యాంక్ ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీలపై పోలీసులు ఆరా తీశారు. డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది, ఎక్కడికి వెళ్తోందనే కోణంలో లోతుగా విచారించారు.


నెదర్లాండ్స్ టూ ఇండియా.. 'ఐబొమ్మ' ఆపరేషన్ ఇలా!

ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వహణ కోసం రవి వాడిన టెక్నాలజీ పోలీసులను ఆశ్చర్యపరిచింది. ఐపీ అడ్రస్‌లను ఎలా మార్చేవాడు, సర్వర్ డేటాను ఎలా భద్రపరిచేవాడు అనే విషయాలపై కూపీ లాగారు. ముఖ్యంగా నెదర్లాండ్స్‌లో ఉన్న హోమ్ సర్వర్ల డేటాపై పోలీసులు కీలక ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ఎక్కడెక్కడ ఉంటూ సినిమాలను అప్లోడ్ చేసేవాడు, ఏ టెక్నాలజీని వాడేవాడు అనే కోణంలో విచారణ సాగింది.


హార్డ్ డిస్క్‌ల సీక్రెట్స్.. మూవీ రూల్స్ లింక్!

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఐబొమ్మ సైట్ నుండి 'మూవీ రూల్స్' వెబ్‌సైట్‌కు రీ-డైరెక్ట్ కావడంపై కూడా పోలీసులు ప్రశ్నించారు. రవి దగ్గర స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్‌లకు పాస్‌వర్డ్స్ ఉండటంతో, రవి ద్వారానే వాటిని ఓపెన్ చేయించి, ఎథికల్ హ్యాకర్ల సహాయంతో అందులోని డేటాను విశ్లేషిస్తున్నారు. అలాగే, అతను వాడిన మొబైల్స్ నుంచి కూడా పూర్తి వివరాలను సేకరించారు.


Tags:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!