అమెరికా ప్రెసిడెంట్ కొడుకు, హాలీవుడ్ పాప్ స్టార్.. వీళ్లంతా ఒక తెలుగు పెళ్లిలో సందడి చేశారంటే నమ్ముతారా? రాజస్థాన్‌లో జరిగిన ఈ బిలియనీర్ వెడ్డింగ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్!
అమెరికాలో స్థిరపడిన ప్రముఖ తెలుగు పారిశ్రామికవేత్త, ఇన్‌జెనస్ ఫార్మా సీఈఓ మంతెన రామలింగరాజు ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన కుమార్తె నేత్ర, టెక్నాలజీ రంగంలో రాణిస్తున్న వంశీ గాదిరాజుతో (సూపర్ ఆర్డర్ కో-ఫౌండర్) ఏడడుగులు వేశారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లు ఈ అద్భుత ఘట్టానికి వేదికయ్యాయి. ఈ వేడుక అట్టహాసం చూసి దేశం మొత్తం ఆశ్చర్యపోతోంది.
జెన్నిఫర్ లోపెజ్ చీరకట్టు.. ట్రంప్ జూనియర్ ఎంట్రీ!
ఈ పెళ్లిలో అసలైన హైలైట్ ఏంటంటే.. హాలీవుడ్ పాప్ ఐకాన్ జెన్నిఫర్ లోపెజ్ (JLo) సంప్రదాయ భారతీయ చీరకట్టులో మెరవడం. ఆమె రాకతో వేడుకకు గ్లోబల్ గ్లామర్ తోడైంది. ఆమెతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు, డొనాల్డ్ ట్రంప్ జూనియర్ తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి హాజరవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
మూడు రోజుల పండగ.. బాలీవుడ్ తారల సందడి
ఉదయ్‌పూర్‌లోని జగ మందిర్ ప్యాలెస్, జెనానా మహల్‌లో జరిగిన ఈ వేడుకలు కళ్లు చెదిరేలా సాగాయి. బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, రణ్‌బీర్ కపూర్, జాన్వీ కపూర్, కృతి సనన్, జాక్వెలిన్ వంటి వారు సందడి చేశారు.
ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణలు ఇవే:
సంగీత్ కార్యక్రమానికి బాలీవుడ్ నటి దియా మీర్జా హోస్ట్‌గా వ్యవహరించగా, లెజెండ్ మాధురీ దీక్షిత్ తన డ్యాన్స్‌తో అదరగొట్టారు.
ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ సర్కస్ బృందం తమ అద్భుత విన్యాసాలతో అతిథులను మంత్రముగ్ధులను చేసింది.
హై-ప్రొఫైల్ గెస్ట్‌ల కోసం మూడు రోజుల్లోనే ఏకంగా 70కి పైగా చార్టర్డ్ విమానాలు ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యాయి.
వధువు తండ్రి రామలింగరాజు మంతెన ఒర్లాండో కేంద్రంగా పనిచేసే ఫార్మా దిగ్గజం. ఈయన గతంలో తిరుమల శ్రీవారికి 28 కిలోల బంగారు సహస్రనామ మాల సమర్పించి వార్తల్లో నిలిచారు. ఇక వరుడు వంశీ కూడా ఫోర్బ్స్ 'అండర్ 30' జాబితాలో చోటు దక్కించుకున్న యువ పారిశ్రామికవేత్త. మొత్తానికి భారతీయ సంప్రదాయం, అంతర్జాతీయ హంగులతో జరిగిన ఈ తెలుగు వారి పెళ్లి ఈ ఏడాదికే హైలైట్‌గా నిలిచింది.

