ఆ సాంగ్ షూటింగ్‌లో హీరోయిన్ కాస్ట్యూమ్ సెట్ కాలేదు.. అప్పుడు ఆ హీరో చేసిన పని ఆ పాటనే మార్చేసింది! 30 ఏళ్ల తర్వాత ఆర్జీవీ బయటపెట్టిన ఆ సీక్రెట్ ఏంటో తెలుసా?
సినీ ప్రేమికులకు రామ్‌గోపాల్ వర్మ (RGV) గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎంతో మంది యువ దర్శకులకు స్ఫూర్తినిచ్చిన ఆయన, 30 ఏళ్ల క్రితం వెండితెరపై 'రంగీలా' (Rangeela) అనే అద్భుతాన్ని సృష్టించారు. తాజాగా ఈ క్లాసిక్ మూవీ రీ-రిలీజ్ సందర్భంగా ఆర్జీవీ ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టారు.
జాకీ ష్రాఫ్ టీషర్ట్‌తో ఊర్మిళ సాంగ్!
ముఖ్యంగా ఎవర్‌గ్రీన్ సాంగ్ "తనహా తనహా" షూటింగ్ సమయంలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ పాటను బీచ్‌లో షూట్ చేయడానికి ప్లాన్ చేశారు. అయితే, కాస్ట్యూమ్ డిజైనర్ తీసుకొచ్చిన డ్రెస్ వర్మకు, టీమ్‌కు అస్సలు నచ్చలేదట. ఆ సమయంలో సెట్‌లో ఉన్న హీరో జాకీ ష్రాఫ్ (Jackie Shroff) వెంటనే తన బనియన్ (టీషర్ట్) తీసి ఇచ్చాడట.
ఆశ్చర్యంగా, జాకీ ఇచ్చిన ఆ టీషర్ట్ వేసుకునే హీరోయిన్ ఊర్మిళ మతోండ్కర్ (Urmila Matondkar) ఆ పాటలో బీచ్‌లో పరిగెత్తారు. అది తన కెరీర్‌లోనే 'మోస్ట్ ఫేవరెట్ షాట్స్'లో ఒకటని వర్మ వెల్లడించారు.
ఫస్ట్ ఛాయిస్ వాళ్లే..
ఈ సినిమాను తాను ఎంతో ఎగ్జైట్‌మెంట్‌తో తీశానని, ప్రధాన పాత్రలకు ఆమీర్‌ఖాన్, ఊర్మిళ, జాకీ ష్రాఫ్‌లే తన ఫస్ట్ ఛాయిస్ అని వర్మ స్పష్టం చేశారు. మూడు దశాబ్దాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే, ఈ సినిమా విషయంలో తాను ఇప్పటికీ పూర్తి సంతృప్తిగా ఉన్నట్లు ఆర్జీవీ తెలిపారు.

