గులాబీలను ప్రేమ, అందానికి చిహ్నంగా భావిస్తారు. ఇవి కేవలం భావోద్వేగాలను పలకడానికే కాదు, మీ ముఖానికి కూడా గులాబీ రంగును (గ్లో) ఇవ్వడానికి అద్భుతంగా సహాయపడతాయి. ఇది వింతగా అనిపించినా, గులాబీలను ఉపయోగించడం ద్వారా, ముఖ్యంగా 'రోజ్ వాటర్' (Rose Water) రూపంలో మెరిసే చర్మాన్ని పొందవచ్చు.
సహజ క్లెన్సర్.. బెస్ట్ టోనర్!
రోజ్ వాటర్ ఒక అద్భుతమైన సహజ క్లెన్సర్‌గా పనిచేస్తుంది. రోజ్ వాటర్‌లో కాటన్ బాల్ ముంచి మీ ముఖాన్ని తుడిస్తే, చర్మంపై పేరుకున్న మురికి, జిడ్డు సులభంగా తొలగిపోతాయి. దీన్ని రోజుకు రెండుసార్లు ఉపయోగించవచ్చు.
ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత, రోజ్ వాటర్‌ను కాటన్ ప్యాడ్‌తో ముఖానికి రాసుకుంటే, ఇది నేచురల్ టోనర్‌లా పనిచేసి చర్మానికి మంచి గ్లో ఇస్తుంది.
మేకప్ రిమూవర్.. ఫేషియల్ మిస్ట్
ముఖంపై ఉన్న మేకప్‌ను తొలగించడానికి కూడా రోజ్ వాటర్ వాడొచ్చు. కొంచెం కొబ్బరి నూనెను రోజ్ వాటర్‌లో కలిపి తుడిస్తే, మేకప్ పూర్తిగా పోతుంది, చర్మం కూడా మృదువుగా మారుతుంది.
రోజ్ వాటర్‌ని స్ప్రే బాటిల్‌లో నింపి, ముఖంపై అప్పుడప్పుడు స్ప్రే చేసుకుంటే చర్మం తాజాగా, తేమగా ఉంటుంది.
మొటిమలు, నల్లటి వలయాలకు చెక్!
రోజ్ వాటర్‌లో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోండి. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే, చర్మంపై బ్యాక్టీరియా తగ్గి మొటిమలు కూడా తొలగిపోతాయి.
అదేవిధంగా, రోజ్ వాటర్‌లో కాటన్ ప్యాడ్స్ నానబెట్టి కళ్ల కింద పెట్టుకుంటే, నల్లటి వలయాలు (డార్క్ సర్కిల్స్) క్రమంగా తగ్గిపోతాయి.
ట్యాన్, ఆయిలీ స్కిన్ సమస్యలకు..
సూర్యుని వల్ల అయిన ట్యాన్‌ను తొలగించడానికి, రోజ్ వాటర్‌లో కొద్దిగా శనగపిండి, నిమ్మరసం వేసి పేస్ట్‌లా చేసి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఆయిల్ స్కిన్ ఉన్న వారు, రోజ్ వాటర్‌లో కలబంద గుజ్జు (అలోవెరా జెల్) కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం తాజాగా, జిడ్డు లేకుండా ఉంటుంది.
రోజ్ వాటర్‌లో గ్లిజరిన్ కలిపి రాత్రిపూట రాసుకుంటే చర్మం పొడిబారకుండా ఉంటుంది. అంతేకాదు, మీరు వాడే ఎలాంటి ఫేస్ ప్యాక్‌లో అయినా కొన్ని చుక్కల రోజ్ వాటర్ కలిపితే, ముఖానికి సహజమైన కాంతి, మృదుత్వం లభిస్తాయి.

