పసిడి ప్రియులకు కాస్త ఊరట లభించింది. రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలకు దేశీయ మార్కెట్లో బ్రేక్ పడింది. నిన్న భారీగా తగ్గిన గోల్డ్ రేట్లలో ఈరోజు ఎలాంటి మార్పు లేదు. అయితే వెండి మాత్రం షాకిస్తోంది.
అంతర్జాతీయ కారణాలు, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు ప్రభావంతో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. అయితే నిన్న దేశీయ మార్కెట్లో తగ్గిన బంగారం ధరలు, ఈరోజు (ఆదివారం, డిసెంబర్ 21) స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో తాజా ధరల వివరాలు ఇప్పుడు చూద్దాం.
అంతర్జాతీయంగా మాత్రం పైకి..
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 7.95 డాలర్లు పెరిగి 4340 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి రేటు కూడా ఔన్సుకు 1.85 డాలర్లు ఎగబాకి 67.14 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
హైదరాబాద్‌లో బంగారం రేట్లు ఇవే..
అంతర్జాతీయంగా పెరిగినా, హైదరాబాద్ మార్కెట్లో మాత్రం బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి.
24 క్యారెట్లు: మేలిమి బంగారం తులం (10 గ్రాములు) ధరలో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం ఇది రూ. 1,34,180 వద్ద విక్రయించబడుతోంది.
22 క్యారెట్లు: ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ. 1,23,000 వద్ద స్థిరంగా ఉంది.
వెండి మాత్రం తగ్గేదేలే!
బంగారం శాంతించినా వెండి మాత్రం ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. నిన్న తగ్గినట్లే తగ్గి.. ఈరోజు మళ్లీ భారీగా పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి ఏకంగా రూ. 5,000 మేర పెరిగింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 2,26,000 రికార్డు స్థాయికి చేరింది.
గమనిక: పైన పేర్కొన్న ధరలు ఉదయం 7 గంటలకు నమోదైనవి. ప్రాంతాలను బట్టి పన్నులు, మజూరీలో మార్పులు ఉంటాయి కాబట్టి కొనుగోలు చేసే ముందు స్థానిక జెవెలర్లను సంప్రదించడం మంచిది.

