ఐపీఎల్ 2026 వేలం: ఫైనల్ లిస్ట్ ఇదే.. డికాక్ ఎంట్రీతో ట్విస్ట్!

naveen
By -

ఐపీఎల్ వేలం అంటేనే ఒక సంచలనం. అయితే ఈసారి రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా ఓ స్టార్ ప్లేయర్ పేరు లిస్ట్‌లో ప్రత్యక్షం కావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.


Quinton de Kock included in IPL 2026 auction list upon franchise request


ఐపీఎల్ 2026 మినీ వేలానికి రంగం సిద్ధమైంది. అబుదాబి వేదికగా జరగనున్న ఈ సమరానికి సంబంధించిన ఆటగాళ్ల తుది జాబితాను బీసీసీఐ ఖరారు చేసింది. మొదట రిజిస్టర్ చేసుకున్న వేలాది మందిని వడపోసి, చివరికి 350 మందితో ఫైనల్ లిస్ట్‌ను విడుదల చేసింది. ఇందులో 1005 మంది పేర్లను తొలగించగా, రిజిస్టర్ చేసుకోని 35 మంది కొత్తవాళ్లకు అనూహ్యంగా చోటు కల్పించడం విశేషం.


లిస్ట్‌లో లేడు.. కానీ డికాక్ వచ్చేశాడు!

ఈ జాబితాలో దక్షిణాఫ్రికా స్టార్ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ (Quinton de Kock) పేరు ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. వాస్తవానికి డికాక్ వేలానికి రిజిస్టర్ చేసుకోలేదు. కానీ, ఇటీవల భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో సెంచరీతో చెలరేగడంతో సీన్ మారిపోయింది. కొన్ని ఫ్రాంచైజీలు ప్రత్యేకంగా అభ్యర్థించడంతో బీసీసీఐ అతని పేరును చేర్చింది.

  • గతంలో రూ. 2 కోట్లుగా ఉన్న తన బేస్ ప్రైస్‌ను ఈసారి డికాక్ రూ. 1 కోటికి తగ్గించుకున్నాడు.

  • డికాక్‌తో పాటు కుశాల్ పెరీరా, దునిత్ వెల్లలాగే వంటి లంక ఆటగాళ్లు, వెస్టిండీస్ ప్లేయర్ అకీమ్ ఆగస్టే కూడా కొత్తగా జాబితాలో చేరారు.


77 సీట్ల కోసం 350 మంది ఫైట్!

ఈ వేలంలో మొత్తం 350 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కానీ అన్ని జట్లు కలిపి ఖాళీగా ఉన్నవి కేవలం 77 స్లాట్లు మాత్రమే. ఇందులో 31 విదేశీ ఆటగాళ్లకు ఛాన్స్ ఉంది.


భారీ ధర పలికే ఛాన్స్ వీరికే: కామెరూన్ గ్రీన్, డెవాన్ కాన్వే, డేవిడ్ మిల్లర్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ వంటి విదేశీ స్టార్లతో పాటు.. భారత్ నుంచి పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, వెంకటేశ్ అయ్యర్, రవి బిష్ణోయ్ (రూ. 2 కోట్ల బేస్ ప్రైస్) భారీ ధర పలికే అవకాశం ఉంది.


వేలం ఎప్పుడు? ఎక్కడ?

ఈసారి వేలంలో బీసీసీఐ మార్క్యూ ఆటగాళ్ల లిస్ట్‌ను తీసేసింది. నేరుగా క్యాప్డ్, ఆ తర్వాత అన్‌క్యాప్డ్ ఆటగాళ్లతో వేలం మొదలవుతుంది.

  • తేదీ: డిసెంబర్ 16 (ఈ నెల 16న)

  • వేదిక: ఎతిహాద్ ఎరీనా, అబుదాబి

  • సమయం: భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు.


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!