పుతిన్ ఫుడ్ సీక్రెట్స్: ఇండియాలో డిన్నర్.. వెంట పర్సనల్ ల్యాబ్!

naveen
By -

పుతిన్ ఇండియా వస్తున్నారంటే రాజకీయాలే కాదు, ఆయన తినే తిండి కూడా హాట్ టాపిక్! ప్రధాని మోదీతో డిన్నర్ చేయబోతున్న రష్యా అధ్యక్షుడికి ఇష్టమైన ఆ 'సీక్రెట్ మెనూ' ఏంటో తెలుసా?


Russian President Vladimir Putin attending a formal dinner event with food served on the table.


నాలుగేళ్ల విరామం తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేడు (గురువారం) భారత్‌లో అడుగుపెడుతున్నారు. ఈ పర్యటనలో పలు కీలక ఒప్పందాలతో పాటు, ప్రధాని మోదీతో ఆయన ప్రత్యేకంగా ప్రైవేట్ డిన్నర్ చేయనున్నారు. దీంతో పుతిన్ ఆహారపు అలవాట్లు, ఆయన డైలీ ఫుడ్ రొటీన్ ఎలా ఉంటుందనే చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆయన ఎక్కువగా తేలికగా జీర్ణమయ్యే, సంప్రదాయ వంటకాలనే ఇష్టపడతారట.


పుతిన్ ఫేవరెట్ మెనూ ఇదే..

అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. రష్యా అధ్యక్షుడి రోజువారీ ఆహారం చాలా ప్రత్యేకంగా ఉంటుంది:

  • బ్రేక్‌ఫాస్ట్: రష్యాలో ఫేమస్ అయిన 'టోవోరాగ్‌' (కాటన్‌ చీజ్‌, తేనె మిశ్రమం), ఉడికించిన గుడ్లు, తాజా పండ్ల రసాలు తీసుకుంటారు.

  • ఇష్టమైనవి: ప్రొటీన్‌ కోసం చేపలను ఎక్కువగా తింటారు. ముఖ్యంగా స్టర్‌జియన్‌ చేప, గొర్రెపిల్ల మాంసం అంటే ఆయనకు మహా ఇష్టం.

  • నో స్వీట్స్: చక్కెర పదార్థాలకు, డెజర్ట్‌లకు ఆయన చాలా దూరం. వాటికి బదులుగా టమాటా, దోసకాయ సలాడ్లు తింటారు. అప్పుడప్పుడు మాత్రమే ఐస్‌క్రీమ్‌ రుచి చూస్తారు.


ఇండియాలో గతం.. కశ్మీరీ టు మొఘలాయ్!

గతంలో 2014లో పుతిన్ వచ్చినప్పుడు నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కశ్మీరీ స్పెషల్స్‌తో విందు ఇచ్చారు. కుంకుమ పువ్వు పానీయం, పాలకూరతో చేసిన 'హాక్‌ కా సాగ్‌', గులాటీ కబాబ్‌ వంటివి వడ్డించారు. ఇక 2018 పర్యటనలో సాల్మాన్‌ ఫిల్లెట్‌, మొఘలాయ్‌ స్టైల్ మటన్, వాటర్‌మిలన్‌ క్రీమ్‌ సూప్‌ వంటి వెరైటీలను ప్రత్యేకంగా సిద్ధం చేశారు.


వెంట వచ్చే 'పర్సనల్ ల్యాబ్'!

విదేశీ పర్యటనల్లో పుతిన్ ఆహారం విషయంలో అత్యంత కఠినమైన భద్రతా ప్రొటోకాల్ ఉంటుంది. ఆయన తినే ఆహారంలో విషం కలవకుండా చూసేందుకు వెంట ఒక పర్సనల్ ల్యాబ్ (Personal Lab) ఎప్పుడూ ఉంటుంది. అంతేకాదు, విదేశాల్లోని హోటల్ స్టాఫ్‌ను ఆయన అస్సలు నమ్మరు. వంట చేయడానికి, వడ్డించడానికి రష్యా నుంచే ప్రత్యేక చెఫ్‌లు, హౌస్ కీపింగ్ సిబ్బంది ఆయన వెంట రావడం గమనార్హం.


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!