రష్యా అధ్యక్షుడు పుతిన్ సెక్యూరిటీ సీక్రెట్స్: బాడీ డబుల్స్, డీఎన్ఏ రక్షణ!

naveen
By -

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుడైన రష్యా అధ్యక్షుడిని కాపాడేది కేవలం తుపాకులు మాత్రమే కాదు.. ఆయన మలమూత్రాలను కూడా అంగరక్షకులు వెంట తీసుకెళ్తారట! ఈ వింత ఆచారం వెనుక ఉన్న అసలు రహస్యం, పుతిన్ భద్రత గురించి వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.


Vladimir Putin's extreme security measures details.


సాధారణంగా దేశాధ్యక్షులకు ఐదంచెల భద్రత ఉండటం సహజం. కానీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) భద్రత మాత్రం హాలీవుడ్ సినిమాలను మించి ఉంటుంది. ఆయన చుట్టూ 24 గంటలూ, 365 రోజులూ ఉండే భద్రతా వలయం దాటి ఈగ కూడా లోపలికి వెళ్లలేదు. ముఖ్యంగా ఆయన విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు పాటించే నిబంధనలు అత్యంత విచిత్రంగా ఉంటాయి. 


పుతిన్ డీఎన్ఏ (DNA) ఎక్కడా, ఎవరికీ దొరకకూడదని ఆయన అంగరక్షకులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఆయన విదేశాలకు వెళ్లినప్పుడు, ఆయన విసర్జించే మలం, యూరిన్‌ను ప్రత్యేక సీల్డ్ బ్యాగుల్లో సేకరించి, తిరిగి మాస్కోకు తీసుకెళ్తారట. శత్రుదేశాలు ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకోకుండా ఉండేందుకే 2017 నుంచి ఈ 'సీక్రెట్ మిషన్' పాటిస్తున్నారు.


బాడీగార్డ్ కావాలంటే.. ఈ రూల్స్ తప్పవు!

రష్యా అధ్యక్షుడికి అంగరక్షకుడిగా ఎంపికవ్వడం ఆషామాషీ వ్యవహారం కాదు. శారీరక బలం ఒక్కటే సరిపోదు, వారి ఎంపికకు చాలా కఠినమైన ప్రమాణాలు ఉంటాయి:

  • వయసు & ఎత్తు: కచ్చితంగా 35 ఏళ్ల లోపు వారే ఉండాలి. ఎత్తు 5.8 నుంచి 6.2 అడుగుల మధ్య ఉండాలి.

  • బరువు: 75 నుంచి 90 కిలోల మధ్య ఫిట్‌గా ఉండాలి.

  • భాషలు: విదేశీ భాషలు అనర్గళంగా మాట్లాడగలగాలి.

  • రిటైర్మెంట్: 35 ఏళ్లు దాటగానే ఆ జాబ్ నుంచి తీసేస్తారు.

పుతిన్ బాత్రూంకు వెళ్ళినా, నిద్రపోతున్నా సరే.. ఈ గార్డులు నీడలా అక్కడే ఉంటారు. ఎంతటి ఉన్నత స్థాయి నేతలనైనా సరే, పుతిన్‌కు మరీ దగ్గరగా వస్తే నిర్దాక్షిణ్యంగా అడ్డుకుంటారు.


ప్లాస్టిక్ సర్జరీతో.. డూప్లికేట్ పుతిన్‌లు!

కేవలం మనుషులే కాదు, పుతిన్ తనలాగే ఉండే 'బాడీ డబుల్స్' (Body Doubles)ను కూడా మెయింటైన్ చేస్తారని ప్రచారం ఉంది. ఉక్రెయిన్ మిలిటరీ చీఫ్ కిరిల్ బుదనోవ్ ప్రకారం, పుతిన్ కనీసం ముగ్గురు డూప్లికేట్లను వాడుతున్నారు. అచ్చం పుతిన్‌లా కనిపించడానికి వీరికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించారట. బహిరంగ సభల్లో, ముప్పు ఎక్కువగా ఉండే చోట్ల ఈ డూప్లికేట్లే కనిపిస్తారని టాక్.


ఆహారంలో విషం? 

ఆయన ప్రయాణించే 'ఆరస్ సెనాత్' (Aurus Senat) కారు ఒక నడిచే ట్యాంక్ లాంటిది. గ్రెనేడ్ దాడులు, మంటలను తట్టుకోవడమే కాదు.. నాలుగు టైర్లు పంక్చర్ అయినా గంటకు 249 కి.మీ వేగంతో దూసుకెళ్లగలదు. ఇక ఆయన తినే ఆహారంలో విషం కలవకుండా చూసేందుకు వెంట ఒక పర్సనల్ ల్యాబ్, రష్యా నుంచి తెచ్చుకున్న చెఫ్‌లు ఉంటారు. ఆయన ప్రయాణించే విమానం 'ఫ్లైయింగ్ క్రెమ్లిన్' (Ilyushin Il-96-300PU)లో జిమ్, బార్, హాస్పిటల్ అన్నీ ఉంటాయి. ఇది ఆగకుండా 11 వేల కిలోమీటర్లు ప్రయాణించగలదు.


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!