జియో హాట్ స్టార్ యూజర్లకు కొత్త షాక్.. ప్లాన్ రేట్లు మారాయి! జనవరి 28 నుంచి భారీ మార్పులు
మొబైల్ డేటా అంటే జియో.. ఓటీటీ అంటే హాట్ స్టార్. ఈ రెండూ కలిస్తే ఎంటర్టైన్మెంట్ కి తిరుగులేదు. కానీ ఇప్పుడు జియో హాట్ స్టార్ (JioHotstar) సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లలో భారీ మార్పులు చేసింది. ఇప్పటివరకు ఒక రేటు ఉంటే.. ఇకపై ఇంకో రేటు ఉండబోతోంది. ముఖ్యంగా నెలవారీ (Monthly) ప్లాన్‌లను ప్రవేశపెట్టినా, కొన్ని ప్లాన్ల ధరలను మాత్రం అమాంతం పెంచేసింది. ఈ కొత్త రేట్లు ఎప్పటి నుంచి అమలవుతాయి? ఎవరికి ఎంత భారం పడనుందో తెలుసుకుందాం.
కొత్త మార్పులు ఏంటి?
ఓటీటీ ప్రియులకు ఫ్లెక్సిబిలిటీ ఇచ్చేందుకు జియో హాట్ స్టార్ మొబైల్, సూపర్, ప్రీమియం అన్ని కేటగిరీల్లో 'నెలవారీ ప్లాన్‌లను' (Monthly Options) అందుబాటులోకి తెచ్చింది. ఇంతకుముందు కేవలం 3 నెలలు లేదా ఏడాది ప్లాన్లు మాత్రమే ఉండేవి. ఈ కొత్త మార్పులు జనవరి 28, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి.
కొత్త రేట్లు ఇవే
జనవరి 28 నుంచి కొత్తగా సబ్‌స్క్రిప్షన్ తీసుకునే వారికి ఈ రేట్లు వర్తిస్తాయి:
మొబైల్ ప్లాన్ (Mobile Plan):
నెలవారీ: రూ. 79
3 నెలలు: రూ. 149
ఏడాదికి: రూ. 499 (ధరలో మార్పు లేదు)
ట్విస్ట్: ఇకపై మొబైల్ ప్లాన్ లో హాలీవుడ్ కంటెంట్ రాదు. కావాలంటే ఎక్స్‌ట్రా డబ్బులు కట్టి యాడ్-ఆన్ చేసుకోవాలి.
సూపర్ ప్లాన్ (Super Plan):
నెలవారీ: రూ. 149
3 నెలలు: రూ. 349 (రూ. 50 పెంపు)
ఏడాదికి: రూ. 1099 (ఏకంగా రూ. 200 పెంపు)
ప్రీమియం ప్లాన్ (Premium Plan):
నెలవారీ: రూ. 299
3 నెలలు: రూ. 699 (రూ. 200 పెంపు)
ఏడాదికి: రూ. 2199 (భారీగా రూ. 700 పెంపు)
పాత యూజర్లకు గుడ్ న్యూస్
ఇప్పటికే సబ్‌స్క్రిప్షన్ ఉన్నవాళ్లకు ఒక గుడ్ న్యూస్. మీ పాత ప్లాన్ గడువు ముగిశాక, ఆటో-రిన్యువల్ (Auto-Renewal) ఆప్షన్ పెట్టుకుంటే మీకు పాత ధరలే వర్తిస్తాయి. కొత్త రేట్లు కేవలం కొత్తగా చేరే వారికి లేదా రీఛార్జ్ మిస్ అయిన వారికి మాత్రమే.

