Ustaad Bhagat Singh Trailer: పవన్ కళ్యాణ్ కంబ్యాక్ అదుర్స్.. 'గబ్బర్ సింగ్' మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
'గబ్బర్ సింగ్' లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఉగాది పండుగ కానుకగా మార్చి 19న (మంగళవారం) థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. ''ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం'' అంటూ పవన్ స్వాగ్, పవర్ ఫుల్ వన్ లైనర్స్‌తో కట్ చేసిన ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. అయితే, పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్, హరీష్ శంకర్ మార్క్ డైలాగ్స్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నా, కొన్ని సీన్స్ మాత్రం గబ్బర్ సింగ్ కు జెరాక్స్ కాపీలా అనిపిస్తున్నాయన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ట్రైలర్ ఎలా ఉందో డీటెయిల్డ్‌గా చూద్దాం.
స్వాగ్, కామెడీ, యాక్షన్.. వింటేజ్ పవన్ ఈజ్ బ్యాక్!
''వాడు నీకు భయపడలేదా? ఎవడికీ భయపడలేదా?'' అనే పవర్ ఫుల్ డైలాగ్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ మొదలైంది. పవన్ కళ్యాణ్ తనదైన స్వాగ్, కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్‌లతో ఈ సినిమాను ఒక కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజీగా తీర్చిదిద్దినట్లు స్పష్టంగా తెలుస్తోంది. భగత్ సింగ్ అనే పోలీస్ ఆఫీసర్‌గా ఒకవైపు విలన్ల ఎముకలు విరుస్తూనే, మరోవైపు తన మీద తానే సెటైర్లు వేసుకుంటూ నవ్వించాడు.
ముఖ్యంగా, ''తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం డ్యాన్స్'' అంటూ పవన్ వేసుకున్న జోక్ హైలైట్ గా నిలిచింది. అలాగే గబ్బర్ సింగ్ లోని అంత్యాక్షరి బ్యాచ్ ఆర్టిస్టుతో.. 'ఈ కాళ్లు కదలాలని ఏళ్ల తరబడి చూస్తున్నామన్నా' అని చెప్పించిన డైలాగ్ ఫ్యాన్స్ కు బాగా కనెక్ట్ అవుతుంది.
డైలాగ్స్ పేలాయి.. కానీ ఆ ఫ్లేవర్ ఎక్కడో చూసినట్లుందే?
ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ట్రైలర్ లో ఇద్దరికీ స్క్రీన్ స్పేస్ ఇచ్చారు. ''ఆయన కంబ్యాక్ ఇచ్చిన ప్రతీసారి మ్యాజిక్ జరుగుద్ది'' అంటూ శ్రీలీల పవన్ కు ఇచ్చిన ఎలివేషన్ అదిరిపోయింది. హరీష్ శంకర్ మార్క్ డైలాగ్స్ ట్రైలర్ లో చాలానే పేలాయి.
- ''రెడ్డి గారు.. ప్రాస కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోకండి''
- ''వైలెన్స్ అంటే మీనింగ్ తెలియక, మీ అందరికీ ప్యాషన్ అయిపోయింది.. చూపిస్తా.. అర్థం, భావం, అవసరం.. అన్నీ చూపిస్తా''
- ''సంతోషంగా ఉండటం అంటే మన జీవితాన్ని మనం లైక్ చేయడం.. మన జీవితానికి ఎవడెవడో లైకులు కొట్టడం కాదు''
అయితే, 2 నిమిషాల 7 సెకండ్ల ఈ ట్రైలర్ లో ఉస్తాద్ భగత్ సింగ్ అసలు కథ ఏంటో రివీల్ చేయకుండా, కేవలం పవన్ క్యారెక్టరైజేషన్‌ను ఎలివేట్ చేయడానికే డైరెక్టర్ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు. ఓజీ (OG) సినిమాలో లాగే పవన్ గన్ను పట్టుకుని ఊగిపోయే ఒక షాట్, పొలిటికల్ టచ్ ఇస్తూ గాజు గ్లాసులు, ఎర్ర కండువాలు కూడా ట్రైలర్ లో చూపించారు. చివర్లో పవన్ ''ఈసారి పర్ఫార్మన్స్ బద్దలైపోద్ది'' అనడం సినిమాపై హైప్ పెంచేసింది.
కానీ, ఓవరాల్ గా చూస్తే ప్రెజెంటేషన్ అంతా దాదాపు 'గబ్బర్ సింగ్' మాదిరిగానే అనిపిస్తోంది. విలన్ పాత్రలో పార్తీబన్, అలాగే రావు రమేష్, సత్య, సత్యం రాజేష్ తదితరులు కనిపించారు.
దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ ఇచ్చిన ఈ సినిమాకి, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (BGM) కొట్టడం విశేషం. అయితే ట్రైలర్ లో థమన్ బీజీఎమ్ కాస్త రొటీన్ గానే అనిపించింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ని రిపీట్ చేస్తుందా, లేక కేవలం పవన్ కళ్యాణ్ స్వాగ్ కే పరిమితం అవుతుందా అనేది మార్చి 19న తేలిపోనుంది. పవన్ ఫ్యాన్స్ కు మాత్రం ఈ ఉగాదికి థియేటర్లలో పండగ వాతావరణం ఖాయంగా కనిపిస్తోంది!
Also Read:
Tollywood Industry Pedda: టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరంటే.. చిరంజీవి పేరు పక్కనపెట్టి తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు!Varalaxmi Sarathkumar Interview : మగాళ్ల చెడ్డీలు కనబడితే తప్పులేదు.. అమ్మాయిల బ్రా స్ట్రాప్ కనిపిస్తేనే పాపమా? వరలక్ష్మి పవర్ ఫుల్ కౌంటర్!
RGV Tweet on Iran War: దేవుళ్ల మధ్య ఫైట్ అంట! యుద్ధంపై ఆర్జీవీ వెకిలి కామెంట్స్ తో భగ్గుమన్న నెటిజన్లు
Sreeleela Ajith Movie: అజిత్ సరసన శ్రీలీలకు ఛాన్స్?

