Varalaxmi Sarathkumar Interview : మగాళ్ల చెడ్డీలు కనబడితే తప్పులేదు.. అమ్మాయిల బ్రా స్ట్రాప్ కనిపిస్తేనే పాపమా? వరలక్ష్మి పవర్ ఫుల్ కౌంటర్!

naveen
By -

టాలీవుడ్‌లో హీరోయిన్ల బట్టలపై జరుగుతున్న రచ్చ చూస్తుంటే.. అసలు మనం 2026లో ఉన్నామా లేక ఇంక వెనకబడే ఉన్నామా అనిపిస్తుంది. నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలతో మొదలైన ఈ వివాదం.. ప్రతి ఇంట్లో ఉండే ఆడబిడ్డల స్వేచ్ఛను ప్రశ్నించే స్థాయికి వెళ్ళింది. హీరోయిన్లు ఏం వేసుకుంటే మనకెందుకు? అని ఒక సామాన్యుడిగా మీరు అనుకోవచ్చు. కానీ, పబ్లిక్ గా ఒక మహిళ క్యారెక్టర్ ని కేవలం ఆమె బట్టలతో డిసైడ్ చేయడం మొదలుపెడితే.. రేపు ఆ మోరల్ పోలీసింగ్ మన ఇంట్లోని ఆడవాళ్ల దాకా రావడం ఖాయం. సరిగ్గా ఇదే పాయింట్ ని లాగుతూ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ అడిగిన ప్రశ్నలు ఇప్పుడు మగ అహంకారాన్ని నిలదీస్తున్నాయి.


Varalaxmi Sarathkumar Interview


డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు? సొసైటీకి వరలక్ష్మి సూటి ప్రశ్న


సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న మోరల్ పోలీసులకు వరలక్ష్మి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. మొన్నటిదాకా నటిగా మెప్పించిన ఆమె, ఫిబ్రవరి 6న రిలీజైన తన డైరెక్షనల్ డెబ్యూ మూవీ 'సరస్వతి' ప్రమోషన్స్ లో మాట్లాడుతూ.. సమాజం నటిస్తున్న డబుల్ స్టాండర్డ్స్ పై విరుచుకుపడ్డారు.


మగాళ్లు జీన్స్ ప్యాంట్ వేసుకొని వంగినప్పుడు వాళ్ళ ఇన్నర్ వేర్ (చెడ్డీలు) బయటకు కనిపిస్తే ఎవరూ పట్టించుకోరు. దానిపై ఎవరూ కామెంట్స్ చేయరు. కానీ ఒక మహిళ బ్రా స్ట్రాప్ కొంచెం బయటకు కనిపిస్తే చాలు.. భూకంపం వచ్చినట్లు, ఆమె లైఫ్ అయిపోయినట్లు ఎందుకు మాట్లాడుతున్నారని వరలక్ష్మి సూటిగా ప్రశ్నించారు. "అది కూడా ఒక బేసిక్ ఇన్నర్ వేర్ కదా, అబ్బాయిలకు ఒక న్యాయం, అమ్మాయిలకు ఒక న్యాయమా?" అని నిలదీశారు.


మీ చెల్లిని చూస్తే రాని ఆలోచన.. వేరే మహిళలపై ఎందుకు?


ఒక అమ్మాయి షార్ట్స్ వేసుకుని బయటకు వెళ్తే.. సొంత చెల్లిని చూసినప్పుడు రాని వెకిలి ఆలోచనలు, రేప్ చేయాలనే బుద్ధి.. బయట వేరే మహిళను చూసినప్పుడు ఎందుకు వస్తున్నాయని మగాళ్ల మైండ్ సెట్ పై ఆమె ఫైర్ అయ్యారు. తప్పు మహిళల డ్రెస్సింగ్ లో లేదని, చూసే చూపులోనే ఉందని బల్లగుద్ది చెప్పారు.


"వాళ్ల బాడీ.. వాళ్ల ఛాయిస్. ఎవరి బట్టలను వాళ్లు డిసైడ్ చేసుకుంటారు. జడ్జ్ చేయడానికి మీరెవరు?" అని కడిగిపారేశారు. అందాన్ని 'వావ్.. వెరీ నైస్' అని ఆరాధించడంలో తప్పులేదని, కానీ ఆ గౌరవం ఒక హద్దు (Line) దాటకూడదని క్లాస్ పీకారు.


బట్టలను బట్టి క్యారెక్టర్ ని డిసైడ్ చేసే ఈ జబ్బు మన సొసైటీలో చాలా లోతుగా పాతుకుపోయింది. శివాజీ కామెంట్స్ అయినా, వాటికి సపోర్ట్ చేసే నెటిజన్ల ఆలోచనా విధానం అయినా దీనికి అద్దం పడుతున్నాయి. ఒక మహిళ ఏం వేసుకోవాలనేది ఆమె వ్యక్తిగత స్వేచ్ఛ. సామాన్యులుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే.. నటీమణులైనా, పక్కింటి అమ్మాయి అయినా, గౌరవం అనేది వారి దుస్తుల్లో కాదు, మన చూసే చూపులో ఉండాలి. మన పిల్లలకు కూడా బట్టలను చూసి జడ్జ్ చేయడం కాకుండా, ఎదుటి వారి స్వేచ్ఛను గౌరవించేలా పెంచడమే ఒక మెరుగైన సమాజానికి పునాది.

Tags: