Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ గురించి హరీష్ కామెంట్స్

naveen
By -

ఓ లక్ష రూపాయలు ఎవరైనా ఆఫర్ చేస్తే చాలు, ఎగిరి గంతేసి ఆ పని చేసేస్తాం. మరి అదే ఒక స్టార్ హీరోకి కేవలం ఒక యాడ్ చేస్తే బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌కు (Shahrukh Khan) ఇచ్చినంత రెమ్యునరేషన్ ఇస్తామంటే ఎవరైనా వదులుకుంటారా? కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాత్రం కోట్ల రూపాయల ఆఫర్‌ను చిత్తుకాగితంలా విసిరేశాడట! అసలు ఆ యాడ్ ఏంటి? పవన్ కళ్యాణ్ ఎందుకు రిజెక్ట్ చేశాడు?


తన అభిమాన హీరో గురించి ఎవరికీ తెలియని ఈ సీక్రెట్‌ను డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) తాజాగా బయటపెట్టారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh) మూవీ మార్చి 26న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్‌లో జరిగిన 'ఆరా ఆఫ్ ఉస్తాద్' (సెకండ్ సాంగ్) లాంచ్ ఈవెంట్‌లో హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.


Ustaad Bhagat Singh


డబ్బుకు లొంగని ఒకే ఒక్కడు.. 


సినిమా వాళ్లంటే కేవలం డబ్బు కోసమే బతుకుతారు, ఏ యాడ్ పడితే ఆ యాడ్ చేస్తారు అనే విమర్శలు ఎప్పుడూ ఉంటాయి. కానీ, పవన్ కళ్యాణ్ రూటే సపరేటు అని హరీష్ శంకర్ మరోసారి స్పష్టం చేశారు.


"2012లో గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ అయ్యాక, అసలు పాన్ ఇండియా అనే పదమే తెలియని రోజుల్లో.. పవన్ కళ్యాణ్ కి ఒక కార్పొరేట్ సంస్థ భారీ యాడ్ ఆఫర్ చేసింది. బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తీసుకునేంత రెమ్యునరేషన్ ఇస్తామన్నారు. నన్నే ఆ యాడ్ డైరెక్ట్ చేయమన్నారు. కానీ, ఆ ప్రొడక్ట్ ఆరోగ్యానికి మంచిది కాదని, ముఖ్యంగా చిన్న పిల్లలపై చెడు ప్రభావం చూపిస్తుందని నా కళ్ల ముందే ఆ కోట్ల రూపాయల ఆఫర్‌ను రిజెక్ట్ చేశాడు. డబ్బుకు ఏమాత్రం లొంగని వ్యక్తి ఆయన" అని హరీష్ శంకర్ గుర్తుచేసుకున్నారు.


"నేను మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే.." 


పవన్ కళ్యాణ్ గత రెండు దశాబ్దాలుగా చేస్తున్న మేనరిజం (మెడ మీద చెయ్యి పెట్టుకోవడం) నుంచి పుట్టిందే ఈ 'ఆరా ఆఫ్ ఉస్తాద్' పాట. ఆ మేనరిజానికి ఒక పవర్ ఫుల్ డైలాగ్ తోడైతే బాగుంటుందనే ఆలోచనతో రాసిందే "నేను మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే" అనే మాస్ హుక్ లైన్.


ఈ లైన్ వినగానే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ (DSP) ఎగిరి గంతేశాడని హరీష్ తెలిపారు. ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ తన కలంతో కేవలం 8 గంటల్లో ఈ పాటకు ప్రాణం పోశారని ప్రశంసించారు. ఇది కేవలం అభిమానంతో రాసిన పాట కాదని, పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ జర్నీ, ఆయన సక్సెస్ వెనుక ఉన్న కష్టాన్ని ప్రతిబింబించే ఫిలాసఫీ అని వివరించారు. "ఫ్యాన్స్ పాలాభిషేకం చేస్తే.. డీఎస్పీ పాటాభిషేకం, చంద్రబోస్ సిరాభిషేకం చేశారు" అంటూ హరీష్ తనదైన స్టైల్ లో పంచ్ వేశారు.


ఉస్తాద్ లో ఏముంటుంది? 


ఎక్కడికి వెళ్లినా ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉంటుందని ఫ్యాన్స్ అడుగుతున్నారని, దానికి తన దగ్గర ఒకే ఆన్సర్ ఉందని హరీష్ చెప్పారు. ఫ్యాన్స్, జనరల్ ఆడియన్స్ పవన్ నుంచి ఏమేమి కోరుకుంటున్నారో.. డాన్స్, డైలాగ్స్, ఎంటర్టైన్మెంట్, హెయిర్ స్టైల్, యాక్షన్ అన్నీ ఈ సినిమాలో పుష్కలంగా ఉంటాయట. 2 గంటల 35 నిమిషాల సినిమాలో, రెండు గంటల పాటు పవన్ కళ్యాణ్‌ను చూసి అభిమానులు తృప్తి పడతారని హరీష్ శంకర్ గ్యారెంటీ ఇచ్చారు. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.


క్యారెక్టర్ ఉన్నోడే రియల్ హీరో! 

ఈ రోజుల్లో గుట్కా యాడ్స్, బెట్టింగ్ యాప్స్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్లు ఉన్న ఇండస్ట్రీలో.. చిన్న పిల్లలకు నష్టం జరుగుతుందని యాడ్ వదులుకున్న పవన్ కళ్యాణ్ నిజంగా రియల్ హీరో. ఒక స్టార్ హీరో వ్యక్తిత్వం సమాజంపై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో చెప్పడానికి ఈ ఘటనే పెద్ద ఉదాహరణ. 'ఉస్తాద్' థియేటర్లలో రచ్చ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.


Tags: