India vs Pakistan Confirmed: ఫిబ్రవరి 15న దాయాదుల పోరు

naveen
By -
India vs Pakistan Confirmed


సస్పెన్స్ వీడింది. క్రికెట్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. వచ్చే ఆదివారం (ఫిబ్రవరి 15) జరగాల్సిన హైవోల్టేజ్ మ్యాచ్ కు లైన్ క్లియర్ అయ్యింది. బంగ్లాదేశ్ ఎపిసోడ్ తో మొదలైన రచ్చకు పాకిస్థాన్ ప్రభుత్వం (Pakistan Government) ఎట్టకేలకు శుభం కార్డు వేసింది. తమ జట్టును భారత్ తో ఆడేందుకు అనుమతిస్తూ సోమవారం రాత్రి అధికారిక ప్రకటన చేసింది. అసలు పాక్ ఎందుకు అలిగింది? చివర్లో ఎవరు ఎంట్రీ ఇస్తే కూల్ అయ్యింది?


ఫిబ్రవరి 15న కొలంబోలో యుద్ధం!

భారత్ తో మ్యాచ్ పై పాక్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్నేహపూర్వక దేశాల విజ్ఞప్తులు, క్రికెట్ స్ఫూర్తిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీంతో షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న శ్రీలంకలోని కొలంబో (Colombo) వేదికగా ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ యథాతథంగా జరగనుంది.


బంగ్లాదేశ్ ఎఫెక్ట్.. శ్రీలంక ఎంట్రీ

అసలు ఈ గొడవకు కారణం బంగ్లాదేశ్. భద్రతా కారణాల దృష్ట్యా భారత్ లో ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరించడంతో, ఆ జట్టును టోర్నీ నుంచి తప్పించారు. దీనికి సంఘీభావంగా.. తాము కూడా భారత్ తో ఆడబోమని పాకిస్థాన్ తొలుత ప్రకటించింది. దీంతో మ్యాచ్ రద్దవుతుందని అంతా భయపడ్డారు.


అయితే, ఈ సంక్షోభాన్ని నివారించడానికి ఐసీసీ (ICC) రంగంలోకి దిగింది. శ్రీలంక, బంగ్లాదేశ్ బోర్డులతో చర్చలు జరిపింది. ముఖ్యంగా శ్రీలంక అధ్యక్షుడు స్వయంగా పాక్ ప్రధానికి ఫోన్ చేసి నచ్చజెప్పడంతో పాక్ ప్రభుత్వం మెత్తబడింది.


ఐసీసీ కన్ఫర్మేషన్.. ఫ్యాన్స్ ఖుషీ

పాకిస్థాన్ తమ టోర్నమెంట్ కట్టుబాట్లకు కట్టుబడి ఉంటుందని ఐసీసీ కూడా ధ్రువీకరించింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్ జరగడం ఖాయం కావడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.


రాజకీయం పక్కనపెడితే.. గెలిచింది క్రికెట్టే! 

గ్రౌండ్ బయట ఎంత గొడవ ఉన్నా.. గ్రౌండ్ లో ఇండియా-పాక్ మ్యాచ్ కి ఉన్న కిక్కే వేరు. ఆ మజాను మిస్ కాకూడదనే అందరూ కోరుకున్నారు.


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!