పాకిస్థాన్ మైండ్ సెట్టే దానికి శత్రువు! అశ్విన్ వార్నింగ్.. ఆ మ్యాచ్ జరిగి తీరుతుంది, రాసిపెట్టుకోండి

naveen
By -

ఫిబ్రవరి 15న ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ ఉందా? లేదా? దాయాది దేశం భీష్మించుకు కూర్చుంది కదా.. అసలు ఏం జరగబోతోంది? అని క్రికెట్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతుంటే.. టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) మాత్రం చాలా కూల్ గా బాంబ్ పేల్చారు. "వంద శాతం మ్యాచ్ జరుగుతుంది.. వాళ్లు ఎక్కడికి పోతారు?" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ చేస్తున్నదంతా డ్రామా అని, వాళ్లకు వేరే శత్రువులు అవసరం లేదని అశ్విన్ ఎందుకు అన్నారు? మ్యాచ్ ఆడకపోతే పాక్ కు జరిగే ఆ భారీ నష్టం ఏంటి? అశ్విన్ విశ్లేషణ ఇదిగో..


Ravichandran Ashwin speaking confidently in a press meet


నాలుగైదు రోజుల్లో దారికి వస్తారు!

టీ20 వరల్డ్ కప్ 2026 (T20 World Cup 2026) ముంగిట పాకిస్థాన్ వ్యవహారంపై అశ్విన్ తనదైన శైలిలో స్పందించారు. బంగ్లాదేశ్ కు మద్దతుగా భారత్ తో మ్యాచ్ ఆడమని పాక్ చెప్పడాన్ని ఆయన సీరియస్ గా తీసుకోలేదు. "ఇదంతా నాలుగైదు రోజుల ముచ్చట. ఆ తర్వాత వాళ్లే దారికి వస్తారు. భారత్-పాక్ మ్యాచ్ కచ్చితంగా జరిగి తీరుతుంది. నేను చూడటానికి వెయిట్ చేస్తున్నా" అని అశ్విన్ ఆశాభావం వ్యక్తం చేశారు.


డబ్బులు పోతాయి.. పీఎస్ఎల్ ఆగిపోద్ది!

పాకిస్థాన్ ఎమోషనల్ గా నిర్ణయం తీసుకుందే తప్ప, ప్రాక్టికల్ గా ఆలోచించలేదని అశ్విన్ విశ్లేషించారు. ఒకవేళ భారత్ తో మ్యాచ్ ఆడకపోతే పీసీబీ (PCB)కి జరిగే నష్టం మామూలుగా ఉండదట.

  • ఆర్థిక దెబ్బ: మ్యాచ్ రద్దయితే బ్రాడ్‌కాస్టర్లు వేల కోట్లు నష్టపోతారు. ఆ ప్రభావం ఐసీసీ రెవెన్యూ షేరింగ్ మీద పడుతుంది. అంటే మిగతా దేశాల బోర్డులు కూడా నష్టపోతాయి. దీన్ని ఐసీసీ సహించదు.

  • లీగ్ కు ముప్పు: పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లో ఆడేందుకు విదేశీ ఆటగాళ్లకు ఇతర బోర్డులు ఎన్‌వోసీలు (NOC) ఇవ్వవు. అప్పుడు పాక్ క్రికెట్ కుదేలవుతుంది.


మీకు మీరే శత్రువులు!

పాకిస్థాన్ వైఖరిని అశ్విన్ తప్పుబట్టారు. "అసలు ఇక్కడ వేదిక సమస్య కానే కాదు. మనం ఎప్పటి నుంచో తటస్థ వేదికల్లోనే ఆడుతున్నాం. శ్రీలంక (Colombo) కూడా తటస్థ వేదికే కదా? ఒక నిర్దిష్ట ప్రత్యర్థితో ఆడనని చెప్పడం క్రీడాస్ఫూర్తి కాదు. అసలు పాకిస్థాన్ కు వేరే శత్రువులే అవసరం లేదు.. వాళ్ల మైండ్ సెట్టే వాళ్లకు అతిపెద్ద శత్రువు" అని అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.


ఎమోషన్స్ వద్దు.. ఎకనామిక్స్ ముఖ్యం! 

అశ్విన్ చెప్పినట్లు.. క్రికెట్ ఇప్పుడు కేవలం ఆట కాదు, అదో పెద్ద వ్యాపారం. ఆర్థిక నష్టాన్ని భరించి, ప్రపంచ క్రికెట్ లో ఒంటరి అవ్వడానికి పాకిస్థాన్ సిద్ధపడదు. కాబట్టి ఈ "బహిష్కరణ" నాటకం ఇంకొన్ని రోజులే!

Tags: