Shivani Nagaram Interview: 72వ అమ్మాయిగా సెలెక్ట్ అయ్యా

naveen
By -
Shivani Nagaram Interview


'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' సినిమాతో కుర్రాళ్ల గుండెల్లో గిటార్ వాయించిన అందాల భామ శివానీ నాగారం. తన నాచురల్ యాక్టింగ్, క్యూట్ లుక్స్ తో మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసిన ఈ తెలుగమ్మాయి.. ఆ తర్వాత 'లిటిల్ హార్ట్స్' చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు తన లక్కీ హీరో సుహాస్ తో జతకట్టి 'హే భగవాన్' (Hey Bhagwan) సినిమాతో ఫిబ్రవరి 20న ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. 


అయితే ఈ సినిమా ప్రమోషన్లలో శివానీ చెప్పిన కొన్ని విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. తను హీరోయిన్ అవుతానని అస్సలు అనుకోలేదని, ఆడిషన్ కి వచ్చిన 72వ అమ్మాయి తానేనని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు, డబ్బుల విషయంలో తానెంత పిసినారో.. కాదు కాదు.. ఎంత జాగ్రత్తపరురాలో కూడా కుండబద్దలు కొట్టింది.


శివానీ నాగారం గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్ లో హీరోయిన్ గా ఎంపికవడం వెనుక పెద్ద కథే ఉంది. అసలు తనకు హీరోయిన్ ఛాన్స్ వస్తుందని ఆమె కలలో కూడా ఊహించలేదట. 'జాతిరత్నాలు' సినిమాలో ఆమె చేసిన ఒక చిన్న పాత్ర చూసి గీతా ఆర్ట్స్ నుంచి పిలుపు వచ్చింది. అయితే ఏదో చెల్లి పాత్రో, ఫ్రెండ్ పాత్రో అయి ఉంటుందని, లేదంటే తనపై ప్రాంక్ చేస్తున్నారేమో అనుకుని వెళ్ళిందట.


హీరో హీరోయిన్లకు కూడా ఆడిషన్స్ ఉంటాయని అప్పటి వరకు తనకు తెలియదని, వాళ్లు డైరెక్ట్ గా సెలెక్ట్ అయిపోతారని అనుకునేదట. గీతా ఆర్ట్స్ నుంచి అఫీషియల్ మెయిల్ వచ్చాకే నమ్మి ఆఫీస్ కు వెళ్ళింది. అక్కడకు వెళ్లాక తెలిసింది.. ఆ పాత్ర కోసం ఆడిషన్ ఇవ్వడానికి వచ్చిన 72వ అమ్మాయి తానని. సెలూన్ షాప్ సీన్ చేసి చూపించాక, డైరెక్టర్ కథ చెప్పడం మొదలుపెట్టారట. 


10 నిమిషాల పాటు కథ చెబుతుంటే.. చిన్న క్యారెక్టర్ కి ఇంత నెరేషన్ ఎందుకు ఇస్తున్నారని అమాయకంగా అడిగిందట. అప్పుడే తెలిసింది ఆమెను పిలిచింది లీడ్ రోల్ కోసమని. ఆడిషన్ లో మరో అమ్మాయి ఓకే అయ్యే ఛాన్స్ ఉన్నా.. చివరికి అదృష్టం శివానీనే వరించింది.


ఇక శివానీ వ్యక్తిగత విషయానికి వస్తే ఆమె పక్కా 'హోమ్ బేబీ' అట. షూటింగ్ లేకపోతే ఇంట్లోనే చిల్ అవ్వడానికి ఇష్టపడుతుందట. బయటకు వెళ్లాలంటే బట్టలు ఐరన్ చేసుకోవాలి, రెడీ అవ్వాలి అని బద్ధకించి, ఫ్రెండ్స్ నే ఇంటికి పిలిపించుకుంటుందట. ఇక డబ్బుల విషయంలో అయితే శివానీ చాలా స్ట్రిక్ట్. సంపాదిస్తున్నాం కదా అని ఇష్టమొచ్చినట్లు ఖర్చు పెట్టదట. 


కనీసం ఒక షర్ట్ కొనాలన్నా 10 రోజులు ఆలోచించి, యూట్యూబ్ లో పది రివ్యూలు చూసి, నలుగురిని అడిగి మరీ కొంటుందట. "నేను అంత ఎడ్డి దాన్ని కాదు.. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ సేవ్ చేయాలి అనే విషయంలో చాలా క్లారిటీగా ఉంటా" అని శివానీ చెప్పుకొచ్చింది. అందంతో పాటు తెలివి కూడా ఉన్న ఈ తెలుగమ్మాయి 'హే భగవాన్'తో మరో హిట్టు కొట్టాలని కోరుకుందాం.


మిడిల్ క్లాస్ మైండ్ సెట్.. స్టార్ హీరోయిన్ కటౌట్! 

ఆడిషన్ లో 72వ అమ్మాయిగా వచ్చి.. ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ కోసం పోటీ పడుతున్న శివానీ జర్నీ ఆసక్తికరం.


Tags:

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!