మైదానంలో పరుగుల వరద పారుతుండొచ్చు, కానీ తెరవెనుక ఒక సైలెంట్ వార్ నడుస్తోంది. ఐపీఎల్‌ను షేక్ చేస్తున్న 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్.. క్రికెట్ ఆత్మ అయిన ఆల్‌రౌండర్ల పాలిట ఉరితాడుగా మారుతోందా?
ఆ రూల్ నాకొద్దు.. అక్షర్ పటేల్ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ బాంబు పేల్చాడు. బ్యాటుతో, బంతితో ప్రాణం పెట్టి ఆడే ఆల్‌రౌండర్ల గొంతు కోస్తున్న ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై బహిరంగంగానే తిరుగుబాటు బావుటా ఎగురవేశాడు.
ఈ రూల్ తనకు ఏమాత్రం నచ్చదని మొహం మీదే చెప్పేశాడు. ఒక ఆల్‌రౌండర్‌గా తాను బతికున్నంత కాలం ఈ నిబంధనను తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉంటానని స్పష్టం చేశాడు.
అసలు ఆల్‌రౌండర్లు ఎందుకు దండగ?
ఒకప్పుడు జట్టులో కచ్చితంగా ఒక ఆల్‌రౌండర్ ఉండాలని యాజమాన్యాలు కోరుకునేవి. కానీ ఇప్పుడు మ్యాచ్ పరిస్థితిని బట్టి ఒక ప్యూర్ బ్యాటర్‌ను లేదా బౌలర్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా దించేస్తున్నారు.
దీనివల్ల అసలు జట్టుకు ఆల్‌రౌండర్ అవసరం ఉందా అన్న చేదు ప్రశ్న తలెత్తుతోందని అక్షర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ రూల్ మాత్రం ఆల్‌రౌండర్లకు తీరని అన్యాయం చేస్తోందని తేల్చిచెప్పాడు. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా కూడా గతంలో ఇదే మాట అన్నారు.
గాయాన్ని దాచిపెట్టి.. జట్టు కోసం పోరాటం
గత సీజన్‌లో అక్షర్ పటేల్ కేవలం 34 ఓవర్లే బౌలింగ్ చేయడం వెనుక ఒక పెద్ద త్యాగమే ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో బంతిని స్పిన్ చేసే వేలికి తీవ్రమైన గాయమైంది.
బౌలింగ్ చేస్తున్న ప్రతిసారీ ఆ గాయం నరకం చూపించినా.. జట్టుకు అవసరమైనప్పుడల్లా బంతిని అందుకున్నాడు. ఏడు మ్యాచ్‌ల తర్వాత గాయం తగ్గినా, తన వేలిని కాపాడుకుంటూనే ఢిల్లీని ముందుకు నడిపించాడు.
అసలైన ఆట మొదలు
గత సీజన్‌లో లీగ్ దశకే పరిమితమైన ఢిల్లీ క్యాపిటల్స్.. ఈసారి కసి మీద ఉంది. ఏప్రిల్ 1న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే తొలి పోరులో అక్షర్ పటేల్ సేన సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది.
అయితే ఈ ఇంపాక్ట్ రూల్ ఇలాగే కొనసాగితే మాత్రం, భవిష్యత్తులో భారత క్రికెట్‌కు గొప్ప ఆల్‌రౌండర్లు దొరకడం కష్టమే. ఫ్రాంచైజీల మజా కోసం క్రికెట్ అసలు సిసలైన ఆత్మను చంపేయడం పక్కా అని క్రీడా పండితులు హెచ్చరిస్తున్నారు!
Also Read:
Sunrisers Abrar Ahmed: పాక్ ప్లేయర్ పై గవాస్కర్ ఫైర్IPL Umpire Salary 2026: ఐపీఎల్ అంపైర్లకు ఒక్కో మ్యాచ్‌కు ఎన్ని లక్షలు ఇస్తారో తెలుసా?
T20 World Cup 2026: సూర్యకుమార్ యాదవ్ వరల్డ్ రికార్డ్
R Ashwin Comments: పీఆర్ నెట్వర్క్ లపై అశ్విన్ ఫైర్
IPL 2026 Updates: క్రిస్ గేల్ 357 సిక్సర్ల రికార్డును బ్రేక్ చేయడం రో-కో లకు సాధ్యమేనా?

