T20 World Cup 2026: విశ్వ విజేతగా భారత్.. తన కెప్టెన్సీ వెనుక ఉన్న అసలు సీక్రెట్ బయటపెట్టిన సూర్య!
ముచ్చటగా మూడోసారి టీ20 ప్రపంచ కప్‌ను ముద్దాడి టీమిండియా అరుదైన రికార్డు సృష్టించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు 2026 టీ20 వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శనతో విశ్వ విజేతగా నిలిచింది. ఈ చారిత్రాత్మక విజయం అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తన కెప్టెన్సీకి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.
గంభీర్ కాదు.. ఆ నలుగురే కారణం
రోహిత్ శర్మ తర్వాత సూర్యకుమార్‌కు అకస్మాత్తుగా జట్టు పగ్గాలు దక్కడం అప్పట్లో అందరినీ తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ వల్లే సూర్యకు ఈ అవకాశం దక్కిందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ, ఈ వార్తలను సూర్య ఖండించాడు. తనను కెప్టెన్‌గా ప్రమోట్ చేయడం వెనుక గంభీర్ కంటే మరో నలుగురి పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశాడు.
బీసీసీఐ మాజీ కార్యదర్శి జై షా, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మరియు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మలే తనను ఎంపిక చేశారని సూర్య వెల్లడించాడు. గంభీర్ కోచ్‌గా రాకముందే ఈ ప్రణాళిక సిద్ధమైందని, శ్రీలంక సిరీస్‌కు కొద్ది రోజుల ముందు జై షా స్వయంగా తనకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పారని ఆయన వివరించాడు. రోహిత్, అగార్కర్, ద్రవిడ్ ల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల తర్వాతే తనకు ఈ బాధ్యతలు దక్కాయని కుండబద్దలు కొట్టాడు.
ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్
తాజా వరల్డ్ కప్ విజయంతో ఎంఎస్ ధోని, రోహిత్ శర్మల తర్వాత ఈ మెగా ట్రోఫీని గెలుచుకున్న మూడవ భారత కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. అంతేకాకుండా, ఈ ఫైనల్ విజయంతో ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన టీ20ఐ కెప్టెన్‌గా వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. సూర్య నాయకత్వంలో టీమిండియా అత్యధిక విజయ శాతాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలో గతంలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ రికార్డును సూర్య అధిగమించడం విశేషం.
Also Read:
IPL 2026 Updates: క్రిస్ గేల్ 357 సిక్సర్ల రికార్డును బ్రేక్ చేయడం రో-కో లకు సాధ్యమేనా?Sanju Samson Interview: వరల్డ్ కప్ గెలుపుపై సంజు భావోద్వేగం
PAK vs BAN: ఢాకా వన్డేలో పాక్, బంగ్లా డీఆర్ఎస్ వివాదం
Vaibhav Suryavanshi: క్రిస్ గేల్ రికార్డే నా టార్గెట్
Yash Dayal Marriage: ఆర్సీబీ స్టార్ సీక్రెట్ పెళ్లి
Vaibhav Suryavanshi: ద్రవిడ్‌కే షాకిచ్చిన వైభవ్ సూర్యవంశీ
T20 World Cup: టీమిండియా సక్సెస్ సీక్రెట్ చెప్పిన గంభీర్
Gautam Gambhir Era: గంభీర్‌కు అసలైన పరీక్ష అదే - గంగూలీ

