R Ashwin on Fan Armies: క్రికెట్‌ను కమ్మేస్తున్న 'పీఆర్' వ్యాధి.. సూపర్ హీరో కల్చర్‌పై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు!
టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సోషల్ మీడియాలో నడుస్తున్న ఫ్యాన్ వార్స్, పీఆర్ (PR) స్ట్రాటజీలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆట కంటే తమ బ్రాండ్ వ్యాల్యూ పెంచుకోవడానికే కొందరు ప్లేయర్స్ ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇది క్రికెట్ ప్రపంచాన్ని పీడిస్తున్న ఒక భయంకరమైన వ్యాధి అని ఆయన ఘాటుగా విమర్శించాడు.
లీకవుతున్న వ్యక్తిగత సంభాషణలు
ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో అశ్విన్ తన మనసులోని మాటలను, తన అనుభవాలను పంచుకున్నాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో లేదా బ్రేక్‌ఫాస్ట్, లంచ్ టేబుల్స్ దగ్గర సహచరులతో మాట్లాడుకునే వ్యక్తిగత విషయాలు, అభిప్రాయాలు సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ల ద్వారా ఎలా ప్రత్యక్షమవుతున్నాయో తనకు అర్థం కావడం లేదన్నాడు. కేవలం కొద్దిమంది మధ్య జరిగిన చర్చలు వేరే పేర్లతో బయటకు వస్తుండటం వెనుక కచ్చితంగా ఒక పక్కా వ్యాపార వ్యూహం (Business Model) ఉండి తీరుతుందని ఆయన తీవ్ర అనుమానం వ్యక్తం చేశాడు.
బ్రాండ్ వ్యాల్యూ ముఖ్యం.. కానీ పక్కనోడిని తగ్గించి కాదు!
ప్రస్తుత రోజుల్లో ప్రతి క్రికెటర్ ఒక ఎంట్రప్రెన్యూర్‌గా మారుతున్నారని, తమ పీఆర్, బ్రాండ్ విలువ పెంచుకోవడానికి ఇలాంటి మార్గాలను ఎంచుకుంటున్నారని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. తమ అభిప్రాయాలను బయటపెట్టి బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడాన్ని తాను పూర్తిగా సమర్థిస్తానని, కానీ దాని కోసం పక్క ఆటగాడిని విమర్శించడం, కించపరచడం తాను ఎప్పటికీ చేయనన్నాడు. ఇదంతా ఆటగాళ్లే స్వయంగా తమ పీఆర్ టీమ్స్ ద్వారా చేయిస్తున్నారని తాను అననప్పటికీ, ఈ నెగెటివ్ కల్చర్ మాత్రం ఒక భయానక వ్యాధిలా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు.
క్రికెట్‌ను సినిమా చేసేశారు
భారత క్రికెట్‌లో 'సూపర్ హీరో' కల్చర్ విపరీతంగా పెరిగిపోయిందని అశ్విన్ మండిపడ్డాడు.
"వాస్తవానికి చెప్పాలంటే మనం క్రికెట్‌ను ఒక సినిమాగా మార్చేశాం. ఇప్పుడు ఎవరైనా అసలు ఆట గురించి, టెక్నిక్ గురించి మాట్లాడుతున్నారా? అందరూ కేవలం ఆటగాళ్ల చుట్టూ అల్లిన ఫేక్ కథనాల గురించే చర్చిస్తున్నారు." అని అశ్విన్ అసహనం వ్యక్తం చేశాడు.
ఒకసారి శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ టెక్నిక్ గురించి తాను విశ్లేషిస్తూ ట్వీట్ చేస్తే, జనం వెంటనే అసలు విషయాన్ని (టెక్నిక్‌ను) వదిలేసి, ఇతర ప్లేయర్స్‌తో గిల్‌ను పోల్చుతూ ఫ్యాన్ వార్స్ మొదలుపెట్టారని ఆయన ఒక ఉదాహరణగా చెప్పుకొచ్చాడు.
Also Read:
IPL 2026 Updates: క్రిస్ గేల్ 357 సిక్సర్ల రికార్డును బ్రేక్ చేయడం రో-కో లకు సాధ్యమేనా?Sanju Samson Interview: వరల్డ్ కప్ గెలుపుపై సంజు భావోద్వేగం
PAK vs BAN: ఢాకా వన్డేలో పాక్, బంగ్లా డీఆర్ఎస్ వివాదం
Vaibhav Suryavanshi: క్రిస్ గేల్ రికార్డే నా టార్గెట్
Yash Dayal Marriage: ఆర్సీబీ స్టార్ సీక్రెట్ పెళ్లి
Vaibhav Suryavanshi: ద్రవిడ్‌కే షాకిచ్చిన వైభవ్ సూర్యవంశీ
T20 World Cup: టీమిండియా సక్సెస్ సీక్రెట్ చెప్పిన గంభీర్
Gautam Gambhir Era: గంభీర్‌కు అసలైన పరీక్ష అదే - గంగూలీ

